JammuKashmir : జ‌మ్మూ సొరంగ ప్ర‌మాదం.. 10 మృత‌దేహాల వెలికితీత‌.. నిర్మాణ సంస్థపై ఎఫ్ఐఆర్ !

By Mahesh RajamoniFirst Published May 21, 2022, 11:15 PM IST
Highlights

Collapsed Jammu Tunnel: జమ్మూకాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ప్ర‌మాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంట్రాక్టు తీసుకున్న సంస్థ‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదుచేసి.. ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
 

rescue operation in Jammu and Kashmir's Ramban: జ‌మ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో 36 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత 10 మంది కార్మికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాంట్రాక్టు తీసుకున్న సంస్థ‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదుచేసి.. ద‌ర్యాప్తు చేస్తున్నారు. ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యంగా ఉన్నందునే చాలా మంది ప్రాణాలు కోల్పోయార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. 

జ‌మ్మూకాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలింది. రాంబాన్ జిల్లా జమ్ము - శ్రీనగర్ నేషనల్ హైవే కింద ఈ సొరంగాన్ని తవ్వుతున్నారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సొరంగం కూలింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సొరంగం కోసం గురువారం బ్లాస్ట్ చేశారు. ఇది జారుడు ప్రాంతం. ఈ క్రమంలోనే 15 మీటర్ల ఎత్తు నుంచి ఓ రాయి కింద‌కు జారిప‌డింది. దీంతో సొరంగం కూలిపోయింది.  36 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత 10 మంది కార్మికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దారుణ ప్రమాదాన్ని దర్యాప్తు చేయడానికి నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పది రోజుల్లో నివేదికను సమర్పించనుంది. 

శ్రీనగర్-జమ్మూ హైవే వెంబడి ఖోనీ నల్లా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం గుహలో భారీ కొండచరియలు విరిగిపడటంతో కార్మికులు శిథిలాల కింద ప‌డి చ‌నిపోయారు. అయితే,  నిర్మాణ సంస్థ ప్రొటెక్షన్ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులు స‌ద‌రు సంస్థ‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. గురువారం సాయంత్రం సొరంగం ఓపెనింగ్ వద్ద కార్మికులు బహిరంగ తవ్వకాలు చేస్తుండగా భారీ రాళ్లు కూలిపోయాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఐదుగురు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు, ఇద్దరు నేపాల్‌కు చెందినవారు, ఒకరు అసోంకు చెందినవారు, ఇద్దరు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కార్మిరులు ప్రాణాలు కోల్పోయారు. 

రెస్క్యూ సైట్‌లో మ‌ళ్లీ భారీ కొండచరియలు విరిగిపడటంతో శుక్రవారం సాయంత్రం ఆగిపోయిన రెస్క్యూ కార్యకలాపాలు శ‌నివారం ఉద‌యం తిరిగి ప్రారంభమయ్యాయి. మృతుల కుంటుంబ స‌భ్యులు సైతం నిర్మాణ సంస్థ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో త‌మ వారు ప్రాణాలు కోల్పోయార‌ని ఆరోపిస్తున్నారు. "వారు స్టెప్ బై స్టెప్ సొరంగం త‌వ్వి ఉంటే.. మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయి వుండేవారు కాదు.. అంటూ మృతుల కుంటుంబాలు క‌న్నీరు ప్ర‌మాద స్థ‌లిలో క‌న్నీరు పెట్టుకున్నాయి. కార్మికులు ర‌క్ష‌ణ కోసం చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో నిర్లక్ష్యంగా వ్య‌వ‌హించిన నిర్మాణ సంస్థ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదుచేశామ‌ని  రాంబన్‌ పోలీసు సూపరింటెండెంట్‌ మోహిత శర్మ తెలిపారు. శ‌నివారం మొత్తం 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మృతదేహాలను వారి బంధువులకు అంత్యక్రియల కోసం అప్పగిస్తామని రాంబన్ జిల్లా మేజిస్ట్రేట్ మసరత్ ఉల్ ఇస్లాం తెలిపారు. విచారణకు ఆదేశిస్తామని చెప్పారు.

click me!