పటియాలా జైలు భోజనం ముట్టని నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆయన లాయర్ ఏం చెప్పాడంటే?

By Mahesh KFirst Published May 21, 2022, 7:35 PM IST
Highlights

పీపీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ నిన్నటి జైలుకు వెళ్లినప్పటి నుంచి భోజనం చేయడం లేదని ఆయన తరఫు న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ తెలిపారు. ఆయన ఆరోగ్యానికి సరిపోయే ఆహారాన్ని అందించాలని ఆయన పటియాలా కోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు.

న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ శుక్రవారం జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ, ఆయన జైలు భోజనం ముట్టలేదని తెలిసింది. శనివారం సాయంత్రం వరకు అంటే నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలుకు వెళ్లి  24 గంటలు గడిచాయని, ఇప్పటి వరకు ఆయన ఒక్క ముద్ద ఆహారం కూడా తినలేదని సిద్ధూ తరఫు న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ వెల్లడించారు.

శుక్రవారం రాత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలులో సరెండర్ అయ్యారని, శుక్రవారం రాత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు జైలు అధికారులు చపాతీలు, పప్పు పెట్టారని వివరించారు. కానీ, నవజ్యోత్ సింగ సిద్దూకు గోధుమ అలర్జెక్ అని, ఆయన దేహానికి గోధుమలు పడటం లేదని, అందుకే ఆయన ఆహారం ముట్టలేదని తెలిపారు.

నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆరోగ్యానికి సరిపడా ఆహారాన్ని అందించాలని న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ పటియాలా కోర్టును కోరారు. అయితే, అధికారుల నుంచి ఇంకా ఆయనకు ఎలాంటి స్పందన రాలేదు. తాను ఉదయం నుంచి జైలు అధికారుల కోసం ఎదురుచూస్తూ ఇదే కోర్టులో కూర్చుని ఉన్నా అని లాయర్ హెచ్‌పీఎస్ వర్మ తెలిపారు. కానీ, ఒక్కరు కూడా రాలేదని అన్నారు.

1988 నాటి రోడ్ రేజ్ కేసులో సిద్ధూకి సుప్రీంకోర్టు గురువారం ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్‌  నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఒక టేబుల్, ఒక కుర్చీ, రెండు తలపాగాలు, ఒక అల్మారా, ఒక దుప్పటి, మూడు సెట్ల లోదుస్తులు, రెండు టవల్స్, ఒక దోమ తెర, ఒక పెన్, ఒక నోట్‌బుక్, ఒక జత బూట్లు, రెండు బెడ్ షీట్లు, నాలుగు జతల కుర్తా పైజామాలు, రెండు దిండు కవర్లు పాటియాలా సెంట్రల్ జైలులో ఇచ్చారు.

అతని ఖైదీ నంబర్ 241383.  నవజ్యోత్ సింగ్ సిద్ధూకు బ్యారక్ నంబర్ 7గా కేటాయించబడిందని వర్గాలు తెలిపాయి. గతంలో 2018 మార్చిలో రూ. 1,000 జరిమానాతో సిద్ధూను విడిచిపెట్టారు. ఇప్పుడు, IPC సెక్షన్ 323 ప్రకారం గరిష్టంగా పడాల్సిన శిక్ష సిద్ధూకి విధించబడింది.

click me!