jammu kashmir : జమ్ముకాశ్మీర్ లో డ్రోన్ ద్వారా ఆయుధాలను జారవిడిచిన ఉగ్ర‌వాద సంస్థ‌లు

Published : Feb 25, 2022, 04:18 AM IST
jammu kashmir : జమ్ముకాశ్మీర్ లో డ్రోన్ ద్వారా ఆయుధాలను జారవిడిచిన ఉగ్ర‌వాద సంస్థ‌లు

సారాంశం

పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు డ్రోన్ సాయంతో భారత్ లోకి తీసుకొచ్చిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు, ఇండియన్ ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లష్కరే తోయిబా, టీఆర్ఎఫ్ ల ప్రమేయం ఉందని తెలిపారు. 

జ‌మ్మూ కాశ్మీర్ ఆర్ఎస్ లోని ట్రెవా గ్రామంలో డ్రోన్ ద్వారా జార‌విడిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న జమ్మూలోని పురాలోని అర్నియా సెక్టార్‌లో గురువారం చోటు చేసుకుంద‌ని పోలీసులు తెలిపారు. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (LeT), ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)లు డ్రోన్ల్ (Drone) ద్వారా మూడు బాక్సుల్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జారవిడిచినట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని పోలీసులు చెప్పారు. 

పురా అర్నియా (Pura Arnia) ప్రాంతంలో నిర్వ‌హించిన సెర్చ్ ఆప‌రేష‌న లో పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) మూడు బాక్సుల నుంచి మూడు డిటోనేటర్లు, మూడు రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (ied), మూడు బాటిల్ పేలుడు పదార్థాలు, ఒక బండిల్ కార్డ్‌టెక్స్ వైర్, రెండు టైమర్ ఐఈడీలు, ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్‌లు, ఆరు గ్రెనేడ్‌లు, 70 రౌండ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ రిక‌వ‌రీ ద్వారా మిలిటెంట్ల వ్యూహం బెడిసికొట్టిన‌ట్టు అయ్యాయి. 

ఇది ఇలా ఉండగా.. కాశ్మీర్‌లో బుద్గాం, బారాముల్లా జిల్లాల నుండి ఎల్‌ఇటీకి చెందిన ఇద్దరు హైబ్రిడ్ మిలిటెంట్లతో సహా ముగ్గురు అల్ట్రాలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స‌మాచారం ఆధారంగా పోలీసులు, ఆర్మీ బుద్గామ్‌లోని అల్లాపోరా నివాసితులైన ఎల్‌ఇటీ ఉగ్రవాది యాసిర్ ముస్తాక్, ఉగ్రవాద సహచరుడు ఇర్ఫాన్ బషీర్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక చైనీస్ గ్రెనేడ్, ఒక ఎకే మ్యాగజైన్, 30 ఎకె రౌండ్లతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రికి సంబంధించిన నేరారోపణ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అరెస్టయిన ఓ ఉగ్రవాది ఇటీవలే టెర్ర‌రిస్ట్ గ్యాంగ్ లో చేరాడ‌ని, అతడికి సహచరుడు లాజిస్టిక్ సపోర్టు అందిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. 

‘‘బారాముల్లాలో పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఇద్దరు హైబ్రిడ్ టెర్రరిస్టులను అరెస్టు చేశాయి. వీరిని ముజామిల్ అహ్మద్, మహ్మద్ యాసీన్ గుర్తించాయి. వీరిద్దరూ  బారాముల్లాలోని చక్లూ నివాసితులు. వీరు ఫిబ్రవరి 16, 2022 నుంచి కనిపించకుండా పోయారు. వీరు పట్టు బడిన తరువాత రెండు చైనీస్ పిస్టల్స్, రెండు మ్యాగజైన్లు, 12 పిస్టల్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నాయి’’ అని పోలీసులు తెలిపారు. సరిహద్దు వెంబడి ఉన్న ఎల్‌ఇటి హ్యాండ్లర్‌లతో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌