జమ్మూ కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు

Published : May 22, 2025, 10:05 AM IST
Jammu Kashmir Encounter

సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని సింగ్‌పోరా ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టాయి. 

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భద్రతా బలగాలు చేపట్టిన ముమ్మర తనిఖీల్లో మరోసారి ఉగ్రవాదుల జాడ తెలిసింది… దీంతో వారిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమయ్యింది. ఇంకా పరస్పర కాల్పులు కొనసాగుతున్నాయి. 

కిష్టావార్‌ జిల్లాలోని సింగ్‌పోరా ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. కిష్టావార్‌లో పోలీసులు, బలగాల జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. సింఘ్‌పొరాలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్‌ నిర్వహించారు... నలుగురు టెర్రరిస్టులను చుట్టుముట్టిన బలగాలు. భద్రత బలగాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. 

 

 

మే 16న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సమన్వయంతో కేలార్, షోపియాన్ మరియు ట్రాల్‌లో నిర్వహించిన రెండు ప్రత్యేక ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు కాశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వికె బిర్డీ తెలిపారు. 

కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఇక్కడ మోహరించిన భద్రతా దళాలు తమ వ్యూహాలను సమీక్షించాయి. ఈ సమీక్ష తర్వాత ప్రత్యేక ఆపరేషన్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు… ఈ క్రమంలోనే 48 గంటల్లోనే రెండు విజయవంతమైన ఆపరేషన్లను నిర్వహించారు. ఈ రెండు ఆపరేషన్లు షోపియాన్‌లోని కేలార్, ట్రాల్ ప్రాంతాల్లో నిర్వహించబడ్డాయి. తాజాగా మరికొందరు ఉగ్రవాదులను గుర్తించిన బలగాలు మరోఆపరేషన్ చేపట్టారు. 

ఇక పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్‌ చేపట్టింది. ఇందులో ఖచ్చితమైన దాడులతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేశాయి. పాకిస్తాన్‌లోని కీలక స్థావరాలపై దాడిలో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మరణించారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భావల్‌పూర్ లోని జైష్ ప్రధాన కార్యాలయం, మురిద్కే లోని లష్కర్ యొక్క కీలక శిక్షణా స్థావరాన్ని ధ్వంసం చేసారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు