జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాల కాల్పులు: ఓ బాలిక, ఇద్దరు యువకులు మృతి

Published : Jul 07, 2018, 02:59 PM ISTUpdated : Jul 07, 2018, 03:03 PM IST
జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాల కాల్పులు: ఓ బాలిక, ఇద్దరు యువకులు మృతి

సారాంశం

జమ్మూకాశ్మీర్ మరోసారి రణరంగంగా మారింది. గ్రామాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు చేపట్టిన కార్డన్ సెర్చ్ కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులతో పాటు ఓ బాలిక మృతిచెందింది. 

వివరాల్లోకి వెళితే...కుల్గావ్ జిల్లాలోని హవూరా గ్రామంలో భద్రతా దళాలు తనికీలు చేపట్టాయి. ఉగ్రవాదులు పటు మారుమూల గ్రామాల్లో తలదాచుకుంటూ అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారిని పట్టుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపడుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది.

గ్రామంలో తనికీ చేపడుతున్న సైనికులపై అల్లరిమూకలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో సైన్యం రక్షణ కోసం వారిని చెదగొట్టే క్రమంలో కాల్పులు ప్రారంభించింది. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులతో పాటు ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను షకీర్ అహ్మద్ (22), ఇర్షద్ మాజిద్ (20), అంద్లీబ్ (16)గా భద్రతా దళాలు గుర్తించాయి. 

అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పుకార్లు చెలరేగుతుండటంతో అనంతనాగ్, సోఫియాన్, పుల్వామా, కుల్గామ్ జిల్లాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరింపజేశారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. మరోవైపు, పుకార్లు చెలరేగకుండా పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 
 
PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం