అసెంబ్లీ వాయిదా: డ్రైనేజీలో బీరు సీసాలు, విపక్షాల ఆగ్రహం

First Published Jul 7, 2018, 2:52 PM IST
Highlights

భారీ వర్షాల కారణంగా అసెంబ్లీలోని పవర్‌హౌజ్‌లోకి వరద నీరు వచ్చి చేరడంతో విద్యుత్ ను నిలిపివేశారు. అసెంబ్లీని వాయిదావేశారు. అసెంబ్లీ డ్రైనేజీ లో ఖాళీ బీరు సీసాలు బయటపడ్డాయి. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి.

ముంబై: భారీ వర్షంతో పాటు విద్యుత్ కోత కారణంగా మహారాష్ట్ర అసెంబ్లీని వాయిదా వేశారు. ఈ రకంగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడం 57 ఏళ్లలో ఇది రెండో సారి. ముంబైలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు  అసెంబ్లీకి విద్యుత్ ను సరఫరా చేసే పవర్ హౌజ్ లోకి నీళ్లు వచ్చి చేరాయి. దీంతో ముందుజాగ్రత్తగా అసెంబ్లీని వాయిదా వేశారు.

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు అసెంబ్లీకి విద్యుత్ ను సరఫరా చేసే పవర్‌హౌజ్‌లోకి నీరు వచ్చి చేరింది. దీంతో ముందుజాగ్రత్తగా విద్యుత్ ను నిలిపివేశారు. అసెంబ్లీని వాయిదా వేశారు.  విధాన్ భవన్ డ్రైనేజీ బ్లాక్ అయింది. దీంతో నీరంతా ట్రాన్స్ ఫార్మర్ ఉన్న రూమ్‌లోకి నీరు వచ్చి చేరిందని అధికారులు ప్రకటించారు.

వరద సహాయ పనులను స్వీకర్ హరిబౌ బగాదే స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీ క్లీనింగ్ పనులను శుక్రవారం నాడు ఆయన పరిశీలించారు. డ్రైనీజీని శుభ్రపరుస్తుండగా  భారీ మొత్తంలో బీరు బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు బయటపడ్డాయి.

అసెంబ్లీ డ్రైనేజీలో బారీగా బీరు బాటిళ్లు బయటకు రావడంతో ప్రభుత్వంపై విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కాంగ్రెస్‌తో పాటు శివసేనలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రభుత్వ పనితీరు ఇదేనా అంటూ నిప్పులు చెరిగారు.నాగ్‌పూర్‌లో తొలిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండగా  ఏర్పాట్లు కూడ సరిగా చేయలేకపోయారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.


 

click me!