జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ రాజీనామా

First Published Jun 19, 2018, 3:22 PM IST
Highlights

జమ్మూ సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా

శ్రీనగర్: జమ్మూ సీఎం మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మంగళవారం  నాడు బిజెపి తన మద్దతును ఉప సంహరించుకొంది. 

దీంతో  సీఎమ తన పదవికి రాజీనామా చేశారు.  రాజీనామా లేఖను  గవర్నర్ కు అందించారు. బిజెపి మద్దతు ఉప సంహరించుకోవడంతో  ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.  దీంతో ఆమె రాజీనామా చేశారు. 

బిజెపి  మద్దతు ఉప సంహారించుకోవడంతో ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ డిమాండ్ చేశారు..


కాశ్మీర్‌లో  కాల్పుల విరమణను పొడిగించే విషయంలో పీడీపీ, బిజెపి మధ్య  విబేధాలు తలెత్తాయి. కాల్పుల విరమణను పొడిగించాలని పీడీపీ పట్టుబడుతోంది. కానీ, బిజెపి మాత్రం ఒప్పుకోలేదు. ఈ కారణంగానే బిజెపి మద్దతును ఉప సంహరించుకొంది. దీంతో ముఫ్తీ రాజీనామా చేయాల్సి వచ్చింది.
 

 

click me!