జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం...ఆరుగురు మృతి, 38మందికి గాయాలు

Published : Mar 02, 2019, 10:33 AM IST
జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం...ఆరుగురు మృతి, 38మందికి గాయాలు

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయిన దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కూడా మరికొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

ఈ ప్రమాదం జమ్మూ కశ్మీర్ లో ఉదంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు సురిన్‌సర్ నుండి శ్రీనగర్ కు ప్రయాణికులను తీసుకెళుతుండగా  మజల్తా ప్రాంతం వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu