ఫిట్టింగ్ సూట్, సన్ గ్లాసెస్ తో కొత్త లుక్ లో జైశంకర్.. ఫొటో వైరల్.. హాలీవుడ్ స్టార్ లా ఉన్నారంటూ కామెంట్లు

Published : May 15, 2023, 09:12 AM IST
ఫిట్టింగ్ సూట్, సన్ గ్లాసెస్ తో కొత్త లుక్ లో జైశంకర్.. ఫొటో వైరల్.. హాలీవుడ్ స్టార్ లా ఉన్నారంటూ కామెంట్లు

సారాంశం

భారత విదేశాంగ మంత్రి నయా లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. సన్ గ్లాసెస్, ఫిట్టింగ్ సూట్ ధరించి ఉన్న ఫొటోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడది వైరల్ గా మారింది. 

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొత్త లుక్ లో కనిపించారు. స్వీడన్ రక్షణ మంత్రి పాల్ జాన్సన్ తో సమావేశం అనంతరం ఆయనతో కలిసి జై శంకర్ ఓ ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటో లో ఆయన ఫిట్టింగ్ సూట్, టై ధరించి, సన్ గ్లాసెస్ పెట్టుకొని చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోను జై శంకర్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఇప్పడది వైరల్ గా మారింది. 

ఆయన లుక్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ లా ఉన్నారంటూ పొగడ్తలతో ముంచెతుత్తున్నారు. ‘టామ్ క్రూయిజ్, బ్రాడ్ పిట్ లకు పోటీగా కనిపిస్తున్నారు’ అని కామెంట్ చేస్తున్నారు. ‘ఇది నిజమైన 007 లుక్’ అంటూ ట్విట్టర్ యూజర్లు పేర్కొంటున్నారు. మరి కొందరు ‘మెన్ ఇన్ బ్లాక్’ అని కామెంట్ చేయగా.. మరో యూజర్ ‘కిల్లర్ లుక్’ అని పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu