
Nagpur on High alert: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయం, హెడ్గేవార్ భవన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు నాగ్‌పుర్‌లో రెక్కీ నిర్వహిస్తున్నరట. దీంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించినట్టు నగర పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు. ఈ సంస్థకు సంబంధించిన ఓ యువకుడిని కేంద్ర దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు
పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాది ఈ ప్రదేశాలలో రెక్సీ నిర్వహించినట్లు నగర పోలీసు కమిషనర్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు నాగ్‌పూర్‌కు వచ్చి ముఖ్యమైన ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్, హెగ్డేవార్ భవన్ తదితర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని నాగ్‌పూర్ పోలీస్ చీఫ్ అమితేష్ కుమార్ చెప్పారు.
అయితే, ఈ విషయం చాలా సున్నితమైనది కావడంతో మరిన్ని వివరాలను తెలియజేయడానికి కుమార్ నిరాకరించారు, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జెఎమ్ ఉగ్రవాదులు ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం మరియు హెడ్గేవార్ భవన్‌లో రెక్కీ చేశారు.
J&K లో టాప్ JeM కమాండర్ హత్య
పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఇందులో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అగ్రశ్రేణి కమాండర్ మీర్ ఒవైసీని భద్రతా బలగాలు హతమార్చాయి. మరో ఇద్దరు జేఈఎం ఉగ్రవాదులను కూడా బలగాలు మట్టుబెట్టాయి.
చండ్గామ్ గ్రామంలో ఉగ్రవాదులున్నారనే నిఘా వర్గాల సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ దళాలు అక్కడకు చేరకుని నిర్బంధన తనిఖీలు చేపట్టాయి. కాగా, పది రోజుల కిందట మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లో 12 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే.