రాజకీయాల్లోకి కరీనా కపూర్.. టికెట్ ఖరారు..?

Published : Jan 21, 2019, 09:37 AM IST
రాజకీయాల్లోకి కరీనా కపూర్.. టికెట్ ఖరారు..?

సారాంశం

బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.


బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. 

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. దీనిని రానున్న మధ్య ప్రదేశ్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌ టికెట్‌ను ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌కు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర నాయకులు.. ఈ విషయం గురించి పార్టీ అధిష్టానంతో చర్చించినట్లు సమాచారం. భోపాల్ ని బీజేని ఓడించాలంటే.. బలమైన అభ్యర్థిని దింపాలని.. అది బాలీవుడ్ నటి కరీనా కపూర్ అయితే బాగుంటుందని వారు భావిస్తున్నారట. ఆమెకు హీరోయిన్ అనే పాలోయింగ్ తోపాటు.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కొడలు వంటి అంశాలు కరీనా గెలిచేందుకు సహకరిస్తాయని గుడ్డు చౌహన్‌ విశ్వసిస్తున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ తాత ఒకప్పుడు భోపాల్‌ నవాబ్‌గా ఉన్నారు. దాంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కరీనా.. కాంగ్రెస్‌ తరఫున భోపాల్‌ నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తుందని వారు భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్