కన్నడ నాట క్యాంప్ రాజకీయాలు: రిసార్టులో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

By sivanagaprasad kodatiFirst Published Jan 20, 2019, 3:21 PM IST
Highlights

కర్ణాటకలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్‌లో ఉండటంతో కన్నడ నాట సంకీర్ణ ప్రభుత్వానికి మరోసారి డేంజర్‌బెల్స్ మోగాయి. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు తమ శాసనసభ్యులను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టాయి.

కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఈగల్టన్ రెస్టారెంట్‌కు తరలించింది. అయితే ఈ రిసార్డులో నిన్న సాయంత్రం కొందరు ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తలపై మరో ఎమ్మెల్యే జేఎన్ గణేశ్ బాటిల్‌తో కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

దాడిలో గాయపడిన ఆనంద్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారని ప్రస్తుతం ఆయన అపోలోలో చికిత్స పొందుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు రిసార్టులో ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత డీకే శివకుమార్ కొట్టిపారేశారు.

అయితే ఆయన సోదరుడు, కాంగ్రెస్ నేత డీకే సురేశ్ అదే ఆస్పత్రి వద్ద ఉన్నారు. కాంగ్రెస్ తీరుపై బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్‌లో పరిస్థితులు దిగజారిపోయాయని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి..? తమ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకెంత కాలం బీజేపీపై ఆరోపణలు చేస్తుందని అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. 

click me!