Hardik Patel's exit: "న‌మ్మ‌క‌ద్రోహం".. హార్థిక్ ప‌టేల్ రాజీనామాపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

By Rajesh KFirst Published May 19, 2022, 12:52 AM IST
Highlights

Hardik Patel's exit: హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. హార్దిక్ పటేల్ నిర్ణయాన్ని నిజాయితీ లేని, నమ్మకద్రోహ రాజకీయంగా పేర్కొంటూ  ఏఐసీసీ ఇంచార్జి రఘు శర్మ మండిపడ్డారు. త‌నపై ఉన్న కేసులను ఎత్తివేయాలని పటేల్ గత ఆరు నెలలుగా భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో టచ్‌లో ఉన్నారని ఆయన ఆరోపించారు.
 

Hardik Patel's exit:  రాబోయే గుజరాత్ ఎన్నికల ముందు  హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేయ‌డంతో భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. హార్దిక్ పటేల్ నిర్ణయాన్ని నిజాయితీ లేని, నమ్మకద్రోహ రాజకీయంగా పేర్కొంటూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇంచార్జి రఘు శర్మ మండిపడ్డారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా పని చేశాడు... యూపీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్ ఎన్నిక‌ల్లో బీజేపీని తీవ్రంగా విమ‌ర్శించారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందని హార్థిక్ ప‌టేల్ ను శర్మ ప్ర‌శ్నించారు.  త‌నపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరుతూ పటేల్ గత ఆరు నెలలుగా భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో టచ్‌లో ఉన్నారని ఆయన ఆరోపించారు.

హార్దిక్ పటేల్ తనపై ఉన్న కేసుల ఉపసంహరణ కోసం గత 6 నెలలుగా బీజేపీతో టచ్‌లో ఉన్నారనీ,  ఇది అవకాశవాద రాజకీయం తప్ప మరేమీ కాదనీ, ఈ విష‌యం గుజరాత్‌కు  అర్థమైందని పార్టీ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్  కూడా విమర్శించారు. 2015లో పాటిదార్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించి, 2020 జూలైలో గుజరాత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ పటేల్‌,  గుజరాత్‌, గుజరాతీలను ద్వేషిస్తున్నట్లు ఉంద‌ని ఆరోపించారు. ఆయ‌న రాజీనామా లేఖలో, అయోధ్యలోని రామ మందిరంపై కాంగ్రెస్ వైఖరి, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు, GST అమలును ప్ర‌స్త‌వించ‌డాన్ని ఆయన విమర్శించారు.

బుధవారం నాడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ నుండి వైదొలిగిన వెంటనే.. ప్రతిపక్ష పార్టీ అత‌నిపై  ఉన్న కేసులను ఉపసంహరించుకుంటానని హామీ ఇచ్చింద‌ని, ప్ర‌తిప‌క్ష పార్టీ అత‌న‌ని ప్ర‌లోభ‌ల‌కు గురి చేసింద‌ని, అతని రాజీనామా లేఖ కూడా  స్క్రిప్ట్  అని ఆరోపించారు. హార్దిక్ పటేల్ నిర్ణయాన్ని నిజాయితీ లేని, నమ్మకద్రోహ రాజకీయాలుగా చేస్తున్న‌ట్టు ఆరోపించారు. బిజెపికి మారిన యువ నాయకులను సున్నాకి తగ్గించారని పేర్కొన్నారు.

click me!