Mamata Banerjee: వాటి నుంచి దృష్టి మ‌ర‌ల్చ‌డానికే మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌ను సృష్టిస్తున్నారు: బీజేపీపై దీదీ ఫైర్‌

By Rajesh KFirst Published May 18, 2022, 10:37 PM IST
Highlights

Mamata Banerjee: కేంద్రం నిత్యవ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లను పెంచూ.. వాటిని నుంచి దృష్టిని మ‌ర‌ల్చేందుకు  మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌ను ప్రేరేపిస్తున్నార‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట నూనెలు స‌హా నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను పెంచి సామాన్యుల‌పై భారం మోపుతోంద‌ని దీదీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
 

Mamata Banerjee: కేంద్ర‌ప్ర‌భుత్వం తీరు పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ‌రోసారి విమ‌ర్శాస్త్రాలను సంధించింది. క్ర‌మంగా నిత్యవ‌స‌ర వ‌స్తువుల ధరల పెరుగుదలపై బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెరుగుతున్న ధరల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గ్యాస్‌, ఇతర వస్తువుల ధరలను పెంచుతూ.. పేద‌వారి న‌డ్డివిరుస్తోంద‌ని ఆరోపించారు.

బుధ‌వారం మేదినీపూర్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో మ‌మ‌తా బెనర్జీ ప్రసంగిస్తూ.. గ్యాస్ లేదా ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌ధాన‌ సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి విభజన వ్యూహంగా పనిచేస్తుందని ఆరోపించింది. 
 
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగుతున్న ప్రతిసారీ, కేంద్ర ప్రభుత్వం ఒక సమస్యను లేవనెత్తుతుందని, ప్రజల దృష్టిని సమస్యల నుండి మళ్లించడానికి మోడీ ప్రభుత్వం మతపరమైన కల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. దేశీయ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా కేంద్రం సామాన్య ప్రజలను లూటీ చేస్తోందని, సామాన్య ప్రజల దృష్టిని మరల్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మత కలహాలకు పాల్పడుతోందని బెనర్జీ అన్నారు.
 
ముఖ్యంగా పెరుగుతున్న ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మార్చి 2022లో.. ప్రభుత్వం గృహావసర వంట గ్యాస్ (LPG) ధరను సిలిండర్‌కు రూ. 50 పెంచి రూ. 949.50కి చేర్చింది. అలాగే.. ఏప్రిల్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.08 శాతానికి చేరింద‌ని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌తో సహా అనేక రాష్ట్రాలు రామ నవమి, హనుమాన్ జయంతి ఊరేగింపుల సందర్భంగా మత ఘర్షణలు త‌ల్లెత్తాయ‌ని గుర్తు చేశారు. రాష్ట్రానికి బకాయిలు విడుదల చేయడంలో విముఖతపై కేంద్రాన్ని బెనర్జీ విమర్శిస్తున్నారు.
 
అలాగే.. ఐసీడీఎస్, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ తదితర పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.92,000 కోట్లు రావాల్సి ఉందని తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుండి వసూలు చేసే డబ్బులో కొంత భాగాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుగా ఇవ్వాలి. కానీ, పశ్చిమ బెంగాల్ విషయంలో, కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, న్యాయబద్ధమైన బకాయిలు చెల్లించడం లేదని దీదీ ఆరోపించింది. MGNREGS, PM ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి వ‌చ్చే బకాయిలను తక్షణమే విడుదల చేయాల‌ని మ‌మతా బెన‌ర్జీ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

click me!