
చట్టవిరుద్దమైన మత మార్పిడులు ఆపడం తన బాధ్యత అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. బలహీనమైన చట్టం కారణంగా బలవంతపు మత మార్పిడులకు పాల్పడే వారు తప్పించుకోకూడదని అన్నారు. అందుకే తమ న్యాయ బృందం ఈ అంశాన్ని అధ్యయనం చేస్తోందని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని అన్నారు.
ఫొటోషూట్ పేరుతో సహాయనటిపై అత్యాచారయత్నం.. కెమెరామెన్ ఘాతుకం...
స్థానిక మీడియా ఛానెల్ కు సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను హిందుత్వం పై మాత్రమే దృష్టి పెట్టడం లేదు. గోవా చరిత్రపై దృష్టి పెట్టాను. నేను మైనారిటీ, మెజారిటీ వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం లేదు. మనం అంతా కలిసి ముందుకు సాగాలి ’’ అని అన్నారు. “ గోవా ప్రగతిశీల రాష్ట్రం. మేము ముందుకు సాగాలని అనుకుంటున్నాం. చట్ట విరుద్ధమైద్ధన మతమార్పిడులు ఆపడం ముఖ్యమంత్రిగా నా హక్కు. ఫిర్యాదు చేసిన వారికి న్యాయం చేయాలి. ప్రస్తుతం ఈ విషయంలో చట్టం దృష్టి బలహీనంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో ఏదైనా అవసరమైతే మేము మార్పులు తీసుకువస్తాము. నా న్యాయ బృందం ఈ విషయాన్ని అధ్యయనం చేస్తోంది ’’ అని సావంత్ చెప్పారు.
యువతిమీద అమ్మాయిల దాడి.. నడిరోడ్డుపై చితకబాదారు.. వైరల్ గా మారిన వీడియో.. ఎందుకు కొట్టారటా అంటే..
ఉత్తర గోవాలోని సోడియం గ్రామంలోని ఫైవ్ పిల్లర్ల చర్చికి చెందిన పాస్టర్ డొమ్నిక్ డిసౌజా ఇటీవల ప్రజలను మతమార్పిడి చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు అయ్యారు. అనంతరం బెయిల్ పై విడుదల అయ్యారు. అప్పటి నుంచి గోవాలో మత మార్పిడి నిరోధక చట్టం పై చర్చ జరుగుతోంది. ‘‘ గోవా సంస్కృతిని మనం కాపాడుకోవాలి. అది మన బాధ్యత. అలాగే గోవా చరిత్రను రేపటి తరానికి అందించాలి.. చరిత్ర తెలియకపోతే రాబోయే తరం సరైన దారిలో వెళ్లదు ’’ అని సీఎం చెప్పారు. బలవంతపు మతమార్పిడులకు పాల్పడే వారిపై ఫిర్యా దు చేస్తే, వారికి న్యాయం చేసేలా
నిబంధనలు ఉండాలని, లేకపోతే చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాంటి వ్యక్తులు స్కాట్ ఫ్రీగా వెళ్లకూళ్లడదని సావంత్ అన్నారు.
అక్టోబర్ 16న తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ
ఇదిలా ఉండగా బలవంతపు మత మార్పిడులను అరికట్టేందుకు గత ఏడాది మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పెళ్లి పేరుతో లేదా ఇతర మోసపూరిత కారణాలతో జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత డిసెంబర్‌లో ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్‌కు చట్టరూపు ఇచ్చింది. ‘మధ్య ప్రదేశ్ మతస్వేచ్ఛ బిల్లు- 2021’ పేరుతో గతేడాది మే 1వ తేదీన ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ ముగిసిన అనంతరం మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ చట్టం ప్రకారం నిబంధలు ఉల్లంఘించిన వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా సైతం విధిస్తారు.