యువతిమీద అమ్మాయిల దాడి.. నడిరోడ్డుపై చితకబాదారు.. వైరల్ గా మారిన వీడియో.. ఎందుకు కొట్టారటా అంటే..

Published : Jun 15, 2022, 09:00 AM IST
యువతిమీద అమ్మాయిల దాడి.. నడిరోడ్డుపై చితకబాదారు.. వైరల్ గా మారిన వీడియో.. ఎందుకు కొట్టారటా అంటే..

సారాంశం

ఓ పిజ్జా డెలివరీ చేసే అమ్మాయిని మరో అమ్మాయిల గుంపు నడిరోడ్డుపై చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఇలా ఎందుకు చేశరటా అంటే.. 

ఇండోర్ : Social mediaలో మరో షాకింగ్ ఘటన కుదిపేస్తోంది.  ఓ అమ్మాయిని మరో అమ్మాయిల గుంపు చితకబాదిన viral video అది.  pizza అవుట్ లెట్ లో పనిచేస్తున్న ఆ అమ్మాయిని నిర్ధాక్షిణ్యంగా.. నడిరోడ్డుపై.. అంతా చూస్తుండగానే చితకబాదారు వాళ్ళు.  ఆ టైంలో ఎవరూ వాళ్లను అడ్డుకోకపోవడం విశేషం. Madhya Pradeshలోని ఇండోర్ ద్వారకాపురి పోలీస్స్టేషన్ పరిధిలో తాజాగా ఈ షాకింగ్ ఘటన  జరిగింది. నందిని యాదవ్ అనే అమ్మాయి డొమినోస్ డెలివరీ గర్ల్ గా పనిచేస్తోంది. శనివారం విధుల కోసం వెళుతున్న ఆమెను నలుగురు అమ్మాయిలు అడ్డగించి.. వాగ్వాదానికి దిగారు. 

ఆపైన ఇష్టమొచ్చినట్లు దాడి చేశారు. ఎందుకు దాడి చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళు ప్రశ్నించడంతో.. తమపై చాడీలు చెబుతోందని సమాధానమిచ్చారు. వాళ్ల కోపాన్ని చూసి.. స్థానికులు ఎవరూ అడ్డగించే ప్రయత్నం చేయలేదు. దీంతో మరింత రెచ్చిపోయి నందినీని కర్రలతో కూడా చితకబాదారు. అయితే కొందరు మాత్రం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది క్రేజీ వీడియోగా వైరల్ అవుతుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాళ్లంతా స్నేహితులే అని,  ప్రధాన నిందితురాలు పింకీ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. 

 

కాక ఇలాంటి ఘటనే  బీహార్లో జనవరిలో జరిగింది. కేవలం ఐదు వందల కోసం ఇద్దరు మహిళా ఆరోగ్య కార్యకర్తలు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో జమాయి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోని జమాయి జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు మహిళలు.. ఆరోగ్య కార్యకర్తలు గా పని చేస్తున్నారు. కాగా వారిద్దరు సడన్ గా ఒకరినొకరు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. వీరు కొట్టుకునే వీడియోలు రికార్డ్ కావడంతో విషయం అధికారులు ముందుకు వచ్చింది. వారి విషయంపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్  షాట్(శిశువులలో  క్షయవ్యాధిని  నివారించడానికి  ఉపయోగించబడుతుంది) కోసం  ఆక్సిలరీ నర్సు మిడ్ వైఫ్ రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకువెళ్లిన తర్వాత ఈ గొడవ జరిగింది. అయితే ఏఎన్ఎం కార్యకర్త  వ్యాక్సిన్ షాట్ కోసం రూ. 500  డిమాండ్ చేశారని ఒకరు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.  దీంతో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఓ వ్యక్తి వచ్చి వారి మధ్య తగాదా తీర్చేందుకు ఎంత ప్రయత్నించినా.. వారు మాత్రం కొట్టుకోవడం ఆపకపోవడం గమనార్హం. ఒకరిమీద ఒకరు చెప్పులు కూడా విసరుకుని మరి కొట్టుకోవడం గమనార్హం.  ఘటనపై సమాచారం అందుకున్న ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ చేశారు. అయితే ఆరోగ్య కార్యకర్తల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !