అది "చట్టపరమైన ఉగ్రవాదం"... 498ఏ దుర్వినియోగంపై కోర్టు సంచలన వ్యాఖ్యలు...

Published : Aug 23, 2023, 12:50 PM IST
అది "చట్టపరమైన ఉగ్రవాదం"...  498ఏ దుర్వినియోగంపై కోర్టు సంచలన వ్యాఖ్యలు...

సారాంశం

సెక్షన్ 498ఏ ను దుర్వినియోగం చేయడం ద్వారా కొత్త చట్టపరమైన ఉగ్రవాదానికి తెరలేపుతున్నారంటూ కలకత్తా హైకోర్టు పేర్కొంది.

న్యూఢిల్లీ :  భర్త లేదా అతని కుటుంబ సభ్యుల వరకట్న వేధింపుల నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498Aని దుర్వినియోగం చేయడం ద్వారా కొంతమంది మహిళలు "చట్టపరమైన ఉగ్రవాదం"కు తెరలేపారని కలకత్తా హైకోర్టు సోమవారం పేర్కొంది. విడిపోయిన భార్య తమపై దాఖలు చేసిన క్రిమినల్ కేసులను సవాలు చేస్తూ ఒక వ్యక్తి, అతని కుటుంబం పెట్టుకున్న అభ్యర్థనలను విచారించిన సందర్భంగా హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

"సమాజంలోని వరకట్న వేధింపులను, అత్తగారింట్లో మహిళలపై జరిగే హింసను తరమడానికి సెక్షన్ 498A నిబంధన అమలులోకి వచ్చింది. "కానీ ఈ నిబంధనను దుర్వినియోగం చేయడం ద్వారా కొత్త చట్టపరమైన ఉగ్రవాదానికి తెరలేప్పుతున్నట్లు అనేక సందర్భాల్లో గమనించవచ్చు. 498Aలో పేర్కొన్న  భద్రత నిర్వచనాన్ని మార్చేసి... వేధింపులు, చిత్రహింసలు కేవలం డిఫాక్టో ఫిర్యాదుదారు ద్వారా మాత్రమే రుజువు చేయబడవు" అని కోర్టు పేర్కొంది.

మిజోరంలో ఘోర ప్రమాదం: రైల్వే బ్రిడ్జి కూలి 17 మంది మృతి

రికార్డుల్లోని వైద్య సాక్ష్యం, సాక్షుల వాంగ్మూలాలు భర్త, అతని కుటుంబానికి వ్యతిరేకంగా ఎటువంటి నేరాన్ని నిర్ధారించలేదని జస్టిస్ సుభేందు సమంత సింగిల్ బెంచ్ పేర్కొంది. మహిళ ఫిర్యాదు ఆధారంగా దిగువ కోర్టు ప్రారంభించిన క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేసింది. "డి-ఫాక్టో ఫిర్యాదుదారు భర్తపై ప్రత్యక్ష ఆరోపణ కేవలం ఆమె వెర్షన్ నుండి వచ్చింది. ఇది ఎటువంటి డాక్యుమెంటరీ లేదా వైద్య సాక్ష్యాలను సమర్ధించదు" అని కోర్టు అభిప్రాయపడింది.

"చట్టం ఫిర్యాదుదారుకు క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేయడానికి అనుమతిస్తుంది. అయితే దానికి తగిన సాక్ష్యాలను జోడించడం ద్వారా మాత్రమే.. దానిని సమర్థించవలసి ఉంటుంది" అని పేర్కొంది. ఈ జంట మొదటి నుండి ఆ వ్యక్తి కుటుంబంతో కాకుండా వేరే ఇంట్లో ఉంటున్నారని కూడా కోర్టు పేర్కొంది. 

"ఫిర్యాదు పిటీషన్‌లోని ఆరోపణ కల్పితం, ఫిర్యాదుదారుడిపై అటువంటి దాడి లేదా హింసకు సంబంధించిన ఘటనలు ఎప్పుడూ జరగలేదు. వివాహం అయినప్పటి నుండి స్త్రీ తన అత్తమామలతో కలిసి ఉండలేదు. విడిగానే ఉంటోంది. భర్త పిటిషనర్, అత్తింటివారు విడివిడిగా నివసిస్తున్నారు”అని కోర్టు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu