తమిళనాడులో ఐటీ రైడ్స్ కలకలం.. డీఎంకే శ్రేణుల నిరసన..

Published : Apr 24, 2023, 10:17 AM ISTUpdated : Apr 24, 2023, 10:32 AM IST
తమిళనాడులో ఐటీ రైడ్స్ కలకలం.. డీఎంకే శ్రేణుల నిరసన..

సారాంశం

తమిళనాడులో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ జీ స్క్వేర్‌‌కు చెందిన వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

తమిళనాడులో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ జీ స్క్వేర్‌‌కు చెందిన వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు నగరాల్లో సంస్థ ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఐటీ సోదాలను వ్యతిరేకిస్తూ డీఎంకే శ్రేణులు ఆందోళనకు దిగాయి. జీ స్క్వేర్‌‌లో డీఎంకే ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడు షేర్ హోల్డర్‌గా ఉన్నారు. అయితే  అన్నా నగర్‌లో ఎమ్మెల్యే మోహన్ కుమారుడి ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడంపై డీఎంకే శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. 

అయితే తమిళనాడులో జీ స్క్వేర్‌ కంపెనీ విపరీతంగా వృద్ది చెందడానికి అధికార డీఎంకే అగ్రనేతలు సహకరిస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో.. ఆ కంపెనీ గతంలో రాజకీయ వివాదంలో చిక్కుకుంది.

 

PREV
click me!

Recommended Stories

Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ