మహిళతో అశ్లీలంగా జార్ఖండ్ మంత్రి వీడియో కాల్.. షేర్ చేసిన బీజేపీ ఎంపీ.. ఇదే కాంగ్రెస్ లక్షణం అంటూ కామెంట్స్..

By Asianet News  |  First Published Apr 24, 2023, 10:10 AM IST

జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బన్నా గుప్తా ఓ మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడిన వీడియోను బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 


కాంగ్రెస్ నేత, జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా ఓ మహిళతో అశ్లీలంగా వీడియో కాల్ మాట్లాడిన వీడియో క్లిప్ ను బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాంగ్రెస్ లక్షణం అని, ఆ పార్టీ సిగ్గుతో చచ్చిపోవాలని ఆయన సందర్భంగా కమెంట్స్ చేశారు. అలాగే ‘తాండూరు మర్డర్ కేసు’ను ప్రస్తావిస్తూ పార్టీపై విరుచుకుపడ్డారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. యువకుడితో 14 ఏళ్ల బాలిక ప్రైవేట్ చాట్.. ఇంటికి పిలిచి లైంగిక దాడి..

Latest Videos

19 సెకన్ల నిడివి గల ఈ వీడియోను దుబే ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. ‘ఇది కాంగ్రెస్ పాత్ర. ఇది జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా గారి వ్యవహారం. మహిళల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త సుశీల్ శర్మ తన భార్యను తాండూరులో తగులబెట్టారు. ఇది నిజమని తేలితే కాంగ్రెస్ సిగ్గుతో మునిగిపోవాలి. ఈ విషయాన్ని గాంధీ కుటుంబం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఓ ప్రైవేట్ న్యూస్ పోర్టల్ నుంచి తనకు ఈ వీడియో అందిందని, అది ఇంకా తన దగ్గరే ఉందని దూబే చెప్పినట్లు వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపిందని ‘ఏబీపీ లైవ్’ నివేదించింది. 

ఈత రాకపోయినా భార్య దూకిందనుకొని బావిలో దూకిన భర్త.. కానీ పొలంలోనే ఏడుస్తూ ఉన్న భార్య.. చివరికి ఏం జరిగిందంటే ?

కాగా.. ఈ ఆరోపణలపై జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా స్పందించారు. ఈ వీడియో ఫేక్ అని, దీనిని ఎడిట్ చేశారని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ వీడియోను సర్క్యులేట్ చేశారని చెప్పారు. ఇది కుట్రలో భాగమని, దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి ట్విట్టర్ లో వెల్లడించారు. ‘‘సోషల్ మీడియాలో నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు, రాజకీయ కక్షతో కొందరు ప్రముఖ రాజకీయ ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా ఫేక్, ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేశారు. ఫోటోషాప్ లేదా మరేదైనా ఎడిటింగ్ యాప్ ద్వారా ఈ తప్పు చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది' అని గుప్తా ట్వీట్ చేశారు. 

यह है का चरित्र,झारखंड के स्वास्थ्य मंत्री बन्ना गुप्ता जी का यह तथाकथित माजरा है।महिलाओं के इज़्ज़त से खेलना,कॉंग्रेस कार्यकर्ता सुशील शर्मा का अपने पत्नी को तंदूर में जलाना,काश गॉंधी परिवार समझ पाता,यदि यह सही है तो कॉंग्रेस के लिए डूब मरने वाली बात है pic.twitter.com/5Wg3EOcivu

— Dr Nishikant Dubey (@nishikant_dubey)

‘‘నేను పోలీసుకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాను. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేసిన తరువాత కారుకులు ఎవరో తెలుస్తుంది. ఈ నకిలీ, ఎడిట్ చేసిన వీడియో ద్వారా నన్ను ఇరికించేందుకు ప్రయత్నించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.సత్యమేవ జయతే!’’ అని మంత్రి బన్నా గుప్తా అన్నారు. ఇదిలా ఉండగా.. జార్ఖండ్ రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో కొనసాగుతున్న సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. 

सोशल मीडिया में मेरी छवि को धूमिल करने और राजनीतिक विद्वेष भावना के साथ कुछ प्रमुख राजनीतिक विरोधियों ने एक सोची समझी साजिश के तहत,एक फेक और एडिट वीडियो को जानबूझ कर वायरल किया है वीडियो में स्पष्ट दिख रहा है कि फोटो शॉप या अन्य किसी एडिटिंग एप्प के माध्यम से यह कुकृत्य किया गया

— Banna Gupta (@BannaGupta76)
click me!