తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో మునిగి ఉన్న రామసేతు నిర్మాణంపై పరిశోధకులు కొత్త విషయాలు కనుగొన్నారు. ఈ వంతెనలోని 99.98శాతం భాగం ధనుష్కోటి నుంచి తలైమన్నార్ వరకు సముద్రపు నీళ్లలో మునిగిపోయి ఉందని గుర్తించారు.
భారత్- శ్రీలంక దేశాల మధ్య ఉన్న పురాతన వంతెన రామసేతును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. చాలా ఏళ్ల క్రితమే నీట మునిగిన ఈ సేతువుకు సంబంధించిన పూర్తి మ్యాప్‌ను తాజాగా ఆవిష్కరించారు. దాంతో పాటు రామసేతు రహస్యాలను వెలికితీశారు. కాగా, రామ సేతును ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రామాయణం సహా అనేక భారతీయ మత గ్రంథాల్లో రామసేతు ప్రస్తావన ఉంది.
తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో మునిగి ఉన్న రామసేతు నిర్మాణంపై పరిశోధకులు కొత్త విషయాలు కనుగొన్నారు. ఈ వంతెనలోని 99.98శాతం భాగం ధనుష్కోటి నుంచి తలైమన్నార్ వరకు సముద్రపు నీళ్లలో మునిగిపోయి ఉందని గుర్తించారు. కాగా, రామసేతు మ్యాప్‌ను పూర్తిస్థాయిలో గుర్తించేందుకు 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు ICESat-2 డేటాను శాస్త్రవేత్తలు వినియోగించారు. రైలు కోచ్ అంత పరిమాణంలో నీట మునిగిన వంతెన శిఖర భాగానికి సంబంధించిన 10-మీటర్ల రిజల్యూషన్ మ్యాప్‌ను గుర్తించారు.
కాగా, రామసేతు మూల ప్రదేశాన్ని గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు రామసేతును సందర్శించిన మోదీ... రామేశ్వరం ఆలయంలో ప్రార్థనలు కూడా చేశారు.
నివేదికల ప్రకారం.. ISRO శాస్త్రవేత్తలు నాసాకు చెందిన అధునాతన శాటిలైట్ లేజర్ టెక్నాలజీని ఉపయోగించి నీటిలో మునిగిపోయిన రామసేతు శిఖరం మొత్తం పొడవును గుర్తించారు. దాని ద్వారా హై-రిజల్యూషన్ మ్యాప్‌ను రూపొందించారు. గిరిబాబు దండబత్తుల నేతృత్వంలోని పరిశోధనా బృందం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి మధ్య ప్రవహించే నీటిలో 11 ఇరుకైన మార్గాలను కనుగొంది. ఇవి సముద్ర అలల నుంచి రామసేతు నిర్మాణాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ అధ్యయనం రామసేతు మూలాలను ధ్రువీకరిస్తుంది. ఒకప్పుడు భారత్- శ్రీలంక మధ్య భూ సంబంధం ఉన్నట్లు స్పష్టం చేస్తోంది.
ఆడమ్స్ బ్రిడ్జ్ చరిత్ర...
భారత్- శ్రీలంక మధ్య నీటిలో మునిగిన వంతెన నిర్మాణానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మ్యాపర్ ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. భారతీయులు దీన్నే రామసేతుగా పేర్కొంటారు. శ్రీలంకలో రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు రాముడి సైన్యం ఈ సేతువు నిర్మించినట్లుగా రామాయణంలో పేర్కొన్నారు.
కాగా, రాముడి వానర సేన రామసేతును నిర్మించిన చోట ప్రధాని మోదీ నడిచారు.
కాగా, క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో పర్షియన్ నావికులు రామ సేతును సేతు బంధై లేదా సముద్రం మీద వంతెనగా పేర్కొన్నారు. 1480లో భారీ తుఫాను కారణంగా రామసేతు దెబ్బతిందని... అప్పటి వరకు అది సముద్ర మట్టానికి పైన ఉందని రామేశ్వరం ఆలయ రికార్డులు సూచిస్తున్నాయి.
అంతకుముందు కూడా ఉపగ్రహ పరిశీలనలు సముద్రగర్భ నిర్మాణాన్ని సూచించాయి. అయితే, ప్రధానంగా వంతెన బహిర్గతమైన విభాగాలపై దృష్టి సారించాయి. రామసేతు ఉండే ప్రాంతంలో సముద్రం 1 నుంచి 10మీటర్ల లోతు ఉండటంతో నేవిగేట్ చేయడానికి షిప్ మ్యాపింగ్‌కి ఇబ్బందిగా ఉండేది.