ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ సెంటర్ నుండి ఎస్ఎస్ఎల్ వీ డీ -2 రాకెట్ ఇవాళ నింగిలోకి వెళ్లింది.
న్యూఢిల్లీ: శ్రీహరికోట షార్ సెంటర్ నుండి ఎస్ఎస్ఎల్‌వీ డీ-2 రాకెట్ ను శుక్రవారం నాడు ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. నిర్ధేశించిన కక్ష్యలోకి ఉపగ్రహలను రాకెట్ ప్రవేశపెట్టింది. 13 నిమిషాల 2 సెకన్ల వ్యవధిలో ఈ ప్రయోగం పూర్తైంది.దీంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.
మూడు చిన్న తరహ శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా ఇస్రో పంపింది .శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ లో మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఇవాళ ఉదయం ఎస్ఎస్‌ఎల్‌వీడీ-2 ను ప్రయోగించారు. ఎస్ఎస్ఎల్ వీ డీ 2 రాకెట్ మూడు శాటిలైట్లను 450 కి.మీ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది . అమెరికాకు చెందిన 1 ఒక ఉపగ్రహం, ఇండియాకు చెందిన రెండు ఉపగ్రహలు కక్ష్యలోకి చేరినట్టుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
undefined
ఈఓఎస్-07 అనే శాటిలైట్ 156.3 కిలోల బరువుంది. దీనిని ఇస్రో అభివృద్ది చేసింది. జానస్-1 అనే ఉపగ్రహం 10.2 కిలోల బరువుంది. అమెరికాలోని అంటారిస్ కు చెందింది. ఆజాదీశాట్-2 ఉపగ్రహం 8.2 కిలోల బరువుంది.
ఎస్ఎస్ఎల్ వీ డీ-1 యొక్క తొలి ప్రయోగం విఫలమైంది. గత ఏడాది ఆగస్టు మాసంలో ఈ ప్రయోగం జరిగింది. ఉపగ్రహలను మోసుకెళ్లిన రాకెట్ నిర్ధేశించిన కక్ష్యలోకి ఉపగ్రహలను పంపలేకపోయింది.