నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం3 రాకెట్: వన్ వెబ్ ఇండియా-2 మిషన్ సక్సెస్

By narsimha lodeFirst Published Mar 26, 2023, 9:13 AM IST
Highlights

 ఇస్రో  ఇవాళ  ఎల్ వీఎం3-ఎం3  రాకెట్ ను  ప్రయోగించింది.  షార్  రెండో  లాంచింగ్ పాడ్  నుండి  ఈ ప్రయోగం నిర్వహించారు.

తిరుపతి: తిరుపతి జిల్లా  శ్రీహరికోట  ఇస్రో  నుండి  ఎల్‌వీఎం 3రాకెట్  నింగిలోకి   దూసుకెళ్లింది.  వన్ వెబ్ కు  చెందిన  36 ఉప గ్రహాలను  ఎల్‌వీఎం 3  రాకెట్ నింగిలోకి  తీసుకెళ్లింది . షార్ రెండో  లాంచ్ పాండ్  నుండి  రాకెట్ ప్రయోగం జరిగింది. 5.8 టన్నుల  36 ఉపగ్రహాలను  ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.   ఆదివారం నాడు  ఉదయం  ఇస్రో  శాస్త్రవేత్తలు  ఈ రాకెట్  ను ప్రయోగించారు.  మూడు దశల్లో  ఈ రాకెట్  నిర్ధీత  కక్ష్యలోకి  ప్రవేశించేలా శాస్త్రవేత్తలు డిజైన్  చేశారు.   మూడు దశలను దాటుకుని  రాకెట్  ఉపగ్రహాలను  నిర్ణీత  కక్ష్యల్లో  ప్రవేశ పెట్టింది .

19.7 నిమిషాల్లో  36 లియో  ఎర్త్ ఆర్బిట్స్ లోకి  ఉపగ్రహాలను  కక్ష్యలోకి పంపింది  రాకెట్. శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మెన్  అభినందించారు.  జీఎస్‌ఎల్‌వీ మార్క్ -3  ప్రయోగాన్ని విజయవంతం  చేసినట్టుగా  ఇస్రో చైర్మెన్ సోమనాథ్  ప్రకటించారు.  వాణిజ్య ప్రయోగాలకు  ఇస్రో ముందంజలో  ఉందని ఆయన  చెప్పారు.

ఇస్రో వాణిజ్య  విభాగం  స్పేస్ ఇండియా లిమిటెడ్  సంస్థతో ఒప్పందం చేసుకుంది.  రెండు దశల్లో  72 ఉపగ్రహాలను ఇస్రో  ప్రయోగించింది.  గత ఏడాది అక్టోబర్ 23న  36 శాటిలైట్లను  విజయవంతంగా  ఇస్రో ప్రయోగించింది.  ఇవాళ రెండో విడతగా  36 ఉపగ్రహాలను  ప్రయోగించారు. 
 

click me!