రాజస్థాన్ లో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత నమోదు..

Published : Mar 26, 2023, 08:47 AM IST
రాజస్థాన్ లో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత నమోదు..

సారాంశం

రాజస్థాన్ లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేటి తెల్లవారుజామున 2 గంటల సమీపంలో సంభవించిన ఈ భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.2గా నమోదు అయ్యింది. 

రాజస్థాన్ లోని బికనీర్ లో మార్చి ఆదివారం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేటి తెల్లవారుజామున 2:16 గంటలకు సంభవించిన ఈ భూకంపం 8 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టమూ జరిగినట్లు సమాచారం లేదు. ‘‘భారత కాలమానం ప్రకారం.. 02:16:37 సమయంలో 26-03-2023న 8 కిలో మీటర్ల లోతులో రాజస్థాన్ లోని బికనీర్ లో భూకంపం సంభవించింది.’’ అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్వీట్ చేసింది.

ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని భావిస్తుంది. బీజేపీ పై ప్రియాంక గాంధీ విమర్శలు

కాగా అదే సమయంలో  అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్ లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం 01:45:09 సమయంలో ఆదివారం భూకంపం సంభవించింది  76 కిలో మీటర్లలో భూకంప కేంద్రం ఉందని భూకంప పర్యవేక్షణ సంస్థ ట్వీట్ చేసింది. 

అలాగే మార్చి 25వ తేదీన రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో మయన్మార్ లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్ సీఎస్ ) తెలిపింది. మయన్మార్ లోని బర్మాకు ఉత్తరాన 106 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో పాటు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి.

"అలా చేయడం వల్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు": రాహుల్ గాంధీపై మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపంలో ఉదయం 10:31 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ సమీపంలో ఉదయం 10:28 గంటలకు 3.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ తెలిపింది.
ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో సుమారు ఆరు సెకన్ల పాటు భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూ ఉద్యోగాల కుంభకోణం కేసులో సీబీఐ దూకుడు.. తేజస్వి యాదవ్‌ పై 8 గంటల పాటు ప్రశ్నల వర్షం

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu