కర్ణాటక బ్లాస్ట్‌తో ఐఎస్ఐఎస్‌కు లింక్.. ఇంట్లోనే బాంబులు తయారు చేస్తున్న నిందితుడు

By Mahesh KFirst Published Nov 21, 2022, 1:53 PM IST
Highlights

కర్ణాటక మంగళూరు బ్లాస్ట్ కేసుకు ఐఎస్ఐఎస్‌కు లింక్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బ్లాస్ట్ కేసులో నిందితుడు షరీఖ్ ఐఎస్ భావజాలంతో ప్రేరణ పొందాడని వివరించారు. ఇంటిలోనే బాంబులు తయారు చేశాడని పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: కర్ణాటకలో మంగళూరు ఆటో బ్లాస్ట్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. ఈ బ్లాస్ట్‌‌కు ఐఎస్ఎస్‌తో లింక్ ఉన్నట్టు తెలుస్తున్నది. బ్లాస్ట్‌ నిందితుడు షరీఖ్ ఐఎస్ఎస్‌తో ప్రేరణ పొంది ఉగ్రకార్యకలాపాల్లోకి దిగాడు. ఐఎస్ఐఎస్ ద్వారా ప్రేరణ పొందిన అల్ హింద్ సహా ఇతర గ్రూపులతో షరీఖ్ సంబంధాలు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో పని చేసినట్ట పోలీసులు తెలిపారు.

మంగళూరు బ్లాస్ట్ కేసు ఉగ్రవాదుల చర్య అని తెలిపిన కర్ణాటక పోలీసులు తాజాగా సంచలన విషయాలను కనుగొన్నారు. ఆ నిందితుడు ఇంట్లోనే బాంబులు తయారు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. అంతేకాదు, వారు శివమొగ్గ నదీ తీరంలో ఈ బాంబుల ట్రయల్ బ్లాస్ట్ కూడా చేసినట్టు తెలిపారు. ఈ ట్రయల్ బ్లాస్ట్ చేసిన ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా షరీఖ్ తప్పించుకున్నట్టు తెలుస్తున్నది.

Also Read: మంగళూరులో కదులుతున్న ఆటోలో పేలుడు: ప్రధాన నిందితుడిని గుర్తించిన పోలీసులు.. గతంలో ఉపా చట్టం కింద కేసు

ఐఎస్ఐఎస్‌ను డార్క్ వెబ్ ద్వారా షరీఖ్ కాంటాక్ట్ అయినట్టు సమాచారం. షరీఖ్‌ను రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న అరాఫత్ అలీ హ్యాండిల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయన అల్ హింద్ మాడ్యుల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ముస్సావిర్ హుస్సేన్‌తో టచ్‌లో ఉన్నారని కర్ణాటక డీజీపీ అలోక్ కుమార్ వివరించారు. అయితే, షరీఖ్ మెయిన్ హ్యాండ్లర్ మాతిన్ తాహా అని, మరో ఇద్దరు ముగ్గురు హ్యాండ్లర్స్ ఉండొచ్చని పోలీసులు చెప్పారు. అయితే, వారిని గుర్తించాల్సి ఉన్నదని తెలిపారు.

ఇప్పటి వరకు పోలీసులు కర్నాటకలో ఐదు లొకేషన్లలో తనిఖీలు చేశారు. ఇందులో మైసూరులోని షరీఖ్ నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. ఆయన నివాసంలో బాంబు తయారీ మెటీరియల్‌ను సీజ్ చేసినట్టు అలోక్ కుమార్ తెలిపారు. 

Also Read: ఆయన ఆధార్ కార్డు పోయింది.. మంగళూరు బ్లాస్ట్ స్పాట్‌లో లభ్యం.. ఏం జరిగిందంటే?

‘షరీఖ్ ఐఎస్ఐఎస్ భావజాలం తలకు ఎక్కించుకున్నాడు. దాని తోనే ఆయన ఇంటి లోనే బాంబు తయారు చేశాడు. సెప్టెంబర్ 19న షరీఖ్ సహా మరో ఇద్దరు కలిసి శివమొగ్గ నదీ తీరంలోని అడవిలో ట్రయల్ బ్లాస్ట్ చేశారు. ఆ తర్వాతి రోజే ఇద్దరిని అరెస్టు చేయగలిగాం. కానీ, షరీఖ్ తప్పించుకున్నాడు. మైసూరులో దొంగిలించిన ఆదార్ కార్డుతో కొత్త ఇంటిని అద్దెకు తీసుకుని బాంబులు తయారు చేయడం కొనసాగించాడు’ అని పోలీసు అధికారి వివరించారు. ఈ కేసుపై పని చేయడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

click me!