ఈషా ఆనంద్ నిశ్చితార్థం ఎక్కడో తెలుసా?

By narsimha lodeFirst Published 21, Sep 2018, 5:00 PM IST
Highlights

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ, పిరమాల్ గ్రూప్స్ వారసుడు ఆనంద్ పిరమాల్ నిశ్చితార్థం శుక్రవారం నాడు కోమో సరస్సు వద్ద అత్యంత విలాసవంతమైన  కోమో సరస్సు వద్ద ఓ గెస్ట్‌హౌజ్ లో నిర్వహించనున్నారు.

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ, పిరమాల్ గ్రూప్స్ వారసుడు ఆనంద్ పిరమాల్ నిశ్చితార్థం శుక్రవారం నాడు కోమో సరస్సు వద్ద అత్యంత విలాసవంతమైన  కోమో సరస్సు వద్ద ఓ గెస్ట్‌హౌజ్ లో నిర్వహించనున్నారు.

అత్యాధునిక భద్రత, అత్యంత విలాసవంతమైన ప్రదేశంగా కోమో సరస్సు ప్రాంతం పేరొందింది.1970 ల కాలంలో ఇదే ప్రాంతంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు మధ్య ప్రపోజ్ చేసినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

నీతాను ఇంప్రెస్ చేయడానికి ఈ ప్రాంతంలోనే డబుల్ డెక్కర్ బస్సులో ముఖేష్ అంబానీ నీతాను తిప్పేవాడని ప్రచారం. ఇదే ప్రాంతంలో అంబానీ తన కూతురు ఈషా అంబానీ నిశ్చితార్థం కూడ ఇక్కడే నిర్వహించనున్నారు. 

ఆనంద్‌ పిరమాల్‌-ఈషా అంబానీలు చిన్ననాటి స్నేహితులు. క్రమేణా వీరి స్నేహం  ప్రేమగా మారింది. కొన్నినెలల క్రితం మహాబలేశ్వర్‌ ఆలయంలో ఆనంద్‌ తన పెళ్లి ప్రతిపాదనను ఈషా ముందు ఉంచారు. ఇందుకు ఆమె కూడా అంగీకరించింది.

వీరి ప్రేమను ఇరు కుటుంబాలు కూడ ఒప్పుకొన్నాయి. దీంతో వివాహం చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి.  ఇందులో భాగంగానే ఇవాళ నిశ్చితార్థం చేయనున్నారు.

Last Updated 21, Sep 2018, 5:00 PM IST