అమెరికాలోని ప్రతిష్టాత్మక స్మిత్సోనియన్ ఆర్ట్ మ్యూజియం బోర్డు ట్రస్టీగా ఇషా అంబానీ

By telugu teamFirst Published Oct 28, 2021, 1:50 PM IST
Highlights

అమెరికాలో ప్రతిష్టాత్మక స్మిత్సోనియన్ ఆర్ట్ మ్యూజియం బోర్డులో ట్రస్టీగా ఇషా అంబానీ ఎంపికయ్యారు. 98 ఏళ్ల చరిత్ర గల ఈ ఇన్‌స్టిట్యూషన్‌లో ఆమె నాలుగేళ్లపాటు ట్రస్టీగా ఉంటారు. భారత, ఆసియా రీజియన్‌లోని కళాఖండాలు, అపురూపమైన వస్తువుల కలెక్షన్, ఆ కళాఖండాల విశిష్టతను కనుగొనడంలో ఇషా అంబానీ కీలకంగా దోహదపడుతారని బోర్డు అభిప్రాయపడింది.
 

న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ కూతురు Isha Ambani మరో కీలక బాధ్యతలు చేపటనున్నారు. Americaలోని ప్రతిష్టాత్మక Smithsonian నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ ట్రస్టీ బోర్డులో కొత్త సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి నాలుగేళ్లపాటు ఆమె ఈ Art Museum బోర్డు ట్రస్టీగా కొనసాగుతారు. వీరి నియామకాన్ని రిజెంట్స్ బోర్డు ఆమోదించింది. రిజెంట్స్ బోర్డులో అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ జీ రాబర్ట్స్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, మరో ముగ్గురు అమెరికన్ సెనేట్లు సహా 17 మంది సభ్యులున్నారు. 

ఎడ్యుకేషన్, రీసెర్చ్ కాంప్లెక్స్‌లకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఇది భాగంగా ఉన్నది. స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఇది డెడికేటెడ్ ఆర్ట్ మ్యూజియం. స్మిత్సోనియన్ ఆర్ట్ మ్యూజియం ఫ్రీ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌గా 1923లో ప్రారంభించారు. త్వరలోనే అంటే 2023లో ఇది శతవసంతాల ఉత్సవాలను నిర్వహించుకోనుంది. ఈ నేపథ్యంలో కొత్త సభ్యుల ఎంపిక జరిగింది.

Also Read: దేశంలోనే తొలి ‘లిక్కర్ మ్యూజియం’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

మారుతున్న సంస్కృతి, కళలను అంచనా వేసి పసిగట్టడం సవాళ్లతో కూడిన పని. దీనికోసం కొత్త సభ్యులను ఎంపిక కూడా అవసరమని రిజెంట్ బోర్డు అభిప్రాయపడింది. బోర్డు సభ్యల్లో పిన్న వయస్కుల్లో ఒకరిగా ఉండనున్న ఇషా అంబానీ విజయన్, ఆర్ట్‌పట్ల ఆమెకున్న ప్యాషన్ భారతీయ, ఆసియాలోని కళలను, వాటి విలువలను ఉత్తమంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయని బోర్డు అభిప్రాయపడింది. తద్వారా విలువైన, నైపుణ్యవంతమైన కలెక్షన్స్‌కు దోహడపడుతుందని, ఈ రీజియన్‌లో అత్యుత్తమ కళాఖండాలను ఆవిష్కరించడానికి సహాయపడుతుందని పేర్కొంది. 

మ్యూజియం శతవార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాని బోర్డు భావిస్తున్నది. తర్వాతి శతాబ్దికి సరికొత్త దారిచూపేదిగా మ్యూజియాన్ని నవీకరించాలని అభిప్రాయపడుతున్నది. అన్ని మార్గాల్లో మ్యూజియం వేసే ప్రభావాన్ని మరింత పెంచాలని యోచిస్తున్నది.

స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్‌లో ఉన్నది. నవీన శిలాయుగం నుంచి నేటి వరకు 45వేల కళాఖండాలు, అపురూపమైన వస్తువులను భద్రపరుస్తున్నది. చైనా, జపాన్, కొరియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇస్లామిక్ ప్రపంచం నుంచీ అనేక పురాతన వస్తువులు ఇక్కడ ఉన్నాయి.

Also Read: అఫ్ఘాన్ మహిళల ఉద్వేగాలు వెదజల్లే కుడ్య చిత్రాలు ఇవే.. ఆ డ్యాషింగ్ ఆర్టిస్టు ఎవరంటే?

ఇషా అంబానీ బయో..
రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ భారత్ ఒక ముఖ్యమైన మొబైల్ డేటా మార్కెట్‌గా మలచడం విశేష కృషి చేసినట్టు ఆమె బయో పేర్కొంది. నేడు జియో భారత్‌లోని అతిపెద్ద నెట్‌వర్క్ ఆపరేటర్లలో ఒకటి. దీనికి ఇప్పుడు 44 కోట్ల సబ్‌స్క్రైబర్లున్నారు. రిలయన్స్ రిటేల్, జియో బ్రాండింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ విషయాల్లో ఆమె చురుకుగా పనిచేశారు. ఫ్యాషన్ పోర్టల్ అజియో డాట్ కామ్ ప్రారంభించడం వెనుక ఆమె ఉన్నారు. జియోమార్ట్ ఈకామర్స్ వెంచర్ కోసమూ ఆమె పనిచేశారు. భారత్‌లోనే అతిపెద్దదైన రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా బాధ్యతల్లో ఉన్నారు. ఆమె యేల్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాలు పొందారు. న్యూయార్క్‌లో మెక్ కెన్సీ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పని చేశారు.

click me!