ఇది ప్రజాస్వామ్యమా?..యూపీ శాంతిభద్రతలపై అఖిలేష్ యాదవ్ ఫైర్

By Mahesh RajamoniFirst Published Jun 7, 2023, 7:36 PM IST
Highlights

Lucknow: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బస్తీ జిల్లాలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో రాజకీయ ప్రతిస్పందనలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ముఖ్య‌మంత్రి యోగి అదిత్యానాథ్ నాయ‌క‌త్వంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయ‌న‌.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
 

Samajwadi Party (SP) chief Akhilesh Yadav : గ్యాంగ్ స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవాను లక్నో కోర్టు వెలుపల కాల్చిచంపిన ఘటనపై సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. యూపీలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నించిన ఆయన ఈ ఘటనను ఖండించారు. "పోలీసు కస్టడీలో, కోర్టులో, పోలీసు సిబ్బంది సమక్షంలో, పోలీస్ స్టేషన్లో చనిపోతున్న వ్య‌క్తులు.. మీకు నచ్చిన వారిని చంపండి అని ప్రభుత్వం వారికి ఉచిత పాస్ ఇచ్చి ఉండవచ్చు" అని ఆయన అన్నారు.

ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నిస్తూ ముఖ్య‌మంత్రి యోగి అదిత్యానాథ్ నాయ‌క‌త్వంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయ‌న‌.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  "చట్టం ఇలా పనిచేస్తుందా? ఎవరిని చంపుతున్నారనేది కాదు, ఆ వ్యక్తిని ఎక్కడ చంపారనేది ప్రశ్న అనీ, అత్యంత భద్రత ఉన్న ప్రదేశంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని రాష్ట్ర శాంతిభ‌ద్ర‌త‌ల‌పై స్పందించారు.

గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీకి అత్యంత సన్నిహితుడు, బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో జీవా సహ నిందితుడిగా ఉన్నాడు. లక్నోలోని కోర్టు భవనం వెలుపల దుండగుడు అత‌నిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ యువతికి గాయాలయ్యాయి. లాయర్ వేషధారణలో కోర్టుకు వచ్చిన దుండగుడు సంజీవ్ జీవాపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తిని విజయ్ యాదవ్ గా గుర్తించిన లక్నో పోలీసులు అరెస్టు చేశారు.

బ‌స్తీ జిల్లా ఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బస్తీ జిల్లాలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో రాజకీయ ప్రతిస్పందనలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ముఖ్య‌మంత్రి యోగి అదిత్యానాథ్ నాయ‌క‌త్వంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయ‌న‌.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఏం జ‌రిగిందంటే.. ? 

బస్తీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై సోమవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం రక్తసిక్త స్థితిలో బాలిక‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు. అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం పోస్టుమార్టంలో ఈ విషయం నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు రోడ్డు దిగ్బంధం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పోలీసులు జామ్ ను క్లియర్ చేశారు. బీజేపీ నేత సహా ముగ్గురిపై బాలిక తల్లి కేసు పెట్టింది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

click me!