బీజేపీ సౌత్ మిషన్: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. సౌత్ లో ప్రధాని మోడీ ఎన్నిసార్లు పర్యటించారో తెలుసా..?

By Rajesh KarampooriFirst Published May 9, 2024, 8:20 PM IST
Highlights

Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు సాధించాలనీ, క్రమంగా సౌత్ పై పట్టు సాధించాలి బిజెపి భావిస్తుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ సైతం దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణతో సహా దక్షిణ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

Lok Sabha Elections 2024: సార్వత్రిక సమరం తారా స్థాయికి చేరింది. ఇప్పటికే మూడు దశలలో పోలింగ్ పూర్తి కాగా.. నాలుగో దశ పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ తరుణంలో అధికారంలోకి ఎవరు రానున్నారు ? ఈ ఎన్నికలలో గెలుపు ఏ పార్టీని వరించనున్నది? అనే చర్చ జరుగుతోంది. అయితే.. దాదాపు అన్ని సర్వేలు బీజేపీ (ఎన్డీఏ)కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రానున్నదని, నరేంద్ర మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతురని పలు సర్వేలు, అటు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. 

సర్వేల ఫలితాలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు తగినట్టుగానే ప్రధాని మోడీ విస్త్రుతంగా పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు సాధించి క్రమంగా సౌత్ పై పట్టు సాధించాలి బిజెపి భావిస్తుంది. ప్రధాని మోదీ సైతం సౌత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణతో సహా దక్షిణ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. సౌత్ పై బిజెపి స్పెషల్ ఫోకస్ క్రమంలో అమిత్ షా సైతం  వరుస పర్యటనలతో దక్షిణాదిపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నిస్తున్నారు.  

సొంతంగా 370 సీట్లు సాధించాలని టార్గెట్  పెట్టుకున్న కమలనాథులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. 130 ఎంపీ సీట్లున్న దక్షిణాదిలో అనుకున్న ఫలితాలు సాధిస్తేనే టార్గెట్ అవుతామని భావిస్తున్నారు బిజెపి అగ్ర నేతలు. ప్రధాని మోదీతో సహా కమలం పార్టీ ప్రముఖ లీడర్ లంత తెలంగాణలో వరుస పెట్టి పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస పెట్టి సౌత్లో సభలకు హాజరవుతున్నారు బడా నేతలు. ఈసారి ప్రధాని మోదీ తమిళనాడులో పదుల సంఖ్యలో మీటింగ్లకు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో తమిళనాడులో మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకోవడం లేదా  భారీ స్థాయిలో ఓట్ షేర్ పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది బిజెపి.

2014 మే 26 నుంచి 2024 ఏప్రిల్ 17 వరకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో మోడీ 146 సార్లు పర్యటించారు. తన రెండు విడతల పదవీకాలంలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఏకంగా 73 సార్లు పర్యటించారు. ఇక ప్రధాని కార్యాలయంలోని రికార్డుల ప్రకారం.. గత మూడు నెలల్లోని దక్షిణాది రాష్ట్రాల్లో 59 పర్యటనలు చేపట్టారు. మొదటి విడత పదవీకాలంలో దేశవ్యాప్త పర్యటనల్లో 14% గా ఉన్న దక్షిణాది రాష్ట్రాల పర్యటన.. రెండో విడత పదవీకాలంలో 18 శాతానికి పెరిగింది. 2022లో 13 సార్లు, 2023లో 23 సార్లు, 2024 లో ఇప్పటివరకు 25 సార్లకు పైగా దక్షిణాదిలో పర్యటించారు ప్రధాని మోడీ. ఈ పర్యటనలన్నీ కేవలం అధికారం కోసమే కాకుండా.. భవిష్యత్తులో పార్టీ పటిష్టం కోసమే అంటున్నారు. బీజేపీకి సౌత్ లో కూడా పట్టుందని త్వరలోనే నిరూపిస్తామంటున్నారు. 

ఈ లోకసభ ఎన్నికల్లో సౌత్లో తమ ఓట్లు సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బిజెపి లీడర్లు 2019 లోక్సభ ఎన్నికల్లో ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో ఏపీలో బిజెపికి 0.97%, కేరళలో 12%, తమిళనాడులో 3.6% ఓట్లు వచ్చాయి. కర్ణాటకలో గత ఎన్నికల్లో 25 లోపు సభ స్థానాలను గెలుచుకున్న బిజెపి ఈసారి ఆ సీట్లను నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.

ఇక 2019లో తెలంగాణలో నాలుగు సీట్లు గెలుచుకున్న బిజెపి ఈసారి పదికి తక్కువ కాకుండా సీట్లు సాధించాలని, ఏపీలో కూటమిగా ఎన్నికల్లోకి వెళుతున్న బిజెపి ఆరు సీట్లలో పోటీ చేస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఏపీలో రెండుసార్లు పర్యటించారు. దక్షిణాదిలో ప్రధాని మోదీ ఇప్పటివరకు 146 సార్లు పర్యటించారు. అందులో 64 అధికారిక కార్యక్రమాలు ఉండగా.. 56 సార్లు పార్టీ తరఫున పర్యటించారు. ఈ పర్యటన బట్టి  దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి నరేంద్ర మోడీ ఎంతగా కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు
 

click me!