Non Consensual Sex: ఇష్టం లేని సెక్స్ కు నో చెప్పే హక్కు భార్యకు ఉంది: ఢిల్లీ హై కోర్టు

By Rajesh KFirst Published Jan 12, 2022, 10:05 AM IST
Highlights

Non Consensual Sex: వైవాహిక స్థితి సంబంధం లేకుండా ఇష్టం లేని సెక్స్ కు నో చేప్పే హక్కు ప్రతి మహిళకు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. ఇష్టం లేని  సెక్స్ నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా? అని ప్రశ్నించింది.  పెళ్లి అయినా, పెళ్లికాని మ‌హిళల‌ గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
 

Non Consensual Sex: వివాహితలు, అవివాహిత స్త్రీల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వైవాహిక స్థితితో సంబంధం లేకుండా..  ఇష్టం లేని, ఏకాభిప్రాయం లేని  లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకూ ఉంటుందని ఉద్ఘాటించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ రాజీవ్‌ శక్ధేర్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ల ధర్మాసనం మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణ సంద‌ర్బంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచార‌ణ స‌మ‌యంలో ప‌లు వాదానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఒక స్త్రీ పెళ్లి చేసుకున్నంత మాత్రనా.. త‌న హ‌క్కుల‌ను కోల్పోతుందా? భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినా స‌మ్మ‌తించాలా ? మహిళ కేవలం ఇతర సివిల్‌, క్రిమినల్‌ చట్టాలనే ఆశ్రయించాలా? భారత శిక్షాస్మృతి(ఐపీసీ)- 375 (అత్యాచారం) సెక్షన్ వ‌ర్తించదా? అనే ప‌లు వాదానాలు వినిపించాయి. 

ఈ వాదనాలు విన్న హైకోర్టు..  IPC యొక్క సెక్షన్ 375 (రేప్) కింద కాకుండా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం) అలాగే ఆర్టికల్ 21 (జీవితానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ) లను ఉల్లంఘించేలా ఉన్నాయా అన్నది పరిశీలించాల్సిన అవసరం ధర్మాసనానికి ఉందని పేర్కొంది. 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న సంగతిని గుర్తుచేసింది.

వివాహిత మహిళకు వ్యక్తిగత చట్టాల ప్రకారం.. క్రూరత్వానికి సంబంధించి విడాకులు తీసుకునే అవకాశం ఉందని, అలాగే ఆమె తన భర్తపై IPC సెక్షన్ 498A (వివాహిత మహిళ పట్ల క్రూరత్వం) కింద క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నందిత రావ్‌ మాత్రం భర్తలకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదని వాదించారు.  

భారత రేప్ చట్టం ప్రకారం భర్తలకు ఇచ్చిన మినహాయింపును కొట్టివేయాలనే అభ్యర్ధనలను వ్యతిరేకిస్తూ, ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది, ఈ మినహాయింపు భర్తతో సహజీవనం చేయడానికి భార్యను బలవంతం చేస్తుందని మరియు ఆమె గౌరవానికి భంగం కలిగిస్తుందని పిటిషనర్లు చూపించవలసి ఉంటుందని అన్నారు.

         ఈ మినహాయింపులు భార్యల గౌరవానికి భంగం కలిగిస్తున్నట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. అది నేరం కాదా? దీంతో జస్టిస్‌ శక్ధేర్‌ కలుగజేసుకొని.. "ఓ మహిళ ఋతు చక్రంలో ఉన్నప్పుడు.. భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించారనుకోండి. 
అయినప్పటికీ బలవంతంగా ఆయన లైంగిక చర్యకు పాల్పడ్డారనుకోండి. అది నేరం కాదా?" అని ప్రశ్నించారు. "అది నేరమే. కానీ అత్యాచార చట్టం పరిధిలోకి రాదు" అని నందిత బదులిచ్చారు.

న్యాయమూర్తి స్పందిస్తూ.. "  ఇది నేరం కానీ రేప్ చట్టం ప్రకారం కాదు. సహజీవనం చేసేవారి విషయంలో ఈ చర్య ఐపీసీ-375 పరిధిలోకి వస్తుంది. వివాహిత విషయంలో రాదు. ఎందుకు? సంబంధాన్ని బట్టి అలా చెప్పడం సరికాదు" అని వ్యాఖ్యానించారు. ఈ లైంగిక చర్యలు పాల్గొనే పార్టీల సంతోషకరమైన సమ్మతితో జరిగినంత కాలం అది నేరం కాదని ధర్మాసనం పేర్కొంది.   భారతీయ అత్యాచార చట్టం కింద భర్తలకు ఇచ్చిన మినహాయింపును కొట్టివేయాలని కోరుతూ ఎన్జీవోలు RIT ఫౌండేషన్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్  దాఖలు చేసిన పిల్‌లను ధర్మాసనం విచారించింది.

click me!