సల్మాన్ రష్దీ దాడిపై స్పందించిన ఇరాన్.. దాడికి కారణం వారేనటా?

Published : Aug 15, 2022, 06:28 PM IST
సల్మాన్ రష్దీ దాడిపై స్పందించిన ఇరాన్.. దాడికి కారణం వారేనటా?

సారాంశం

సల్మాన్ రష్దీపై దాడికి కారణంగా చాలా మంది ఇరాన్ వైపు వేల్లెత్తి చూపించారు. రష్దీపై దాడి చేసిన వ్యక్తి కూడా ఇస్లాం పట్ల అభిమానం కలిగి ఉండటం ఈ అనుమానాలను బలపరిచింది. కానీ, ఆయన హత్యలో తమకు ఏ సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది.  

న్యూఢిల్లీ: సల్మాన్ రష్దీ 1988లో పబ్లిష్ చేసిన తన రచన సాతానిక్ వెర్సెస్ పుస్తకంపై అప్పుడు తీవ్ర చర్చ జరిగింది. ముఖ్యంగా కొన్ని ముస్లిం వర్గాలు ఆగ్రహించాయి. ఈ రచన మత దూషణకు ఏ మాత్రం తక్కువ లేదని వాదించాయి. ఇరాన్ దేశమైతే ఏకంగా సాతానిక్ వెర్సెస్ పుస్తక రచయిత సల్మాన్ రష్దీని చంపేయాలి ముస్లింలకు సూచనిలస్తూ ఓ ఫత్వా జారీ చేసింది. అప్పటి నుంచి సల్మాన్ రష్దీ అజ్ఞాతంలోనే ఉంటున్నారు. ఎక్కువగా బహిరంగంగా కనిపించేవారు కాదు. కానీ, తాజాగా, ఆయనపై కత్తితో దాడి చేయగానే.. మళ్లీ ఫత్వా గురించిన చర్చ మొదలైంది.

సల్మాన్ రష్దీ పై దాడికి పాల్పడిన హాదీ మటర్ కూడా షియా తీవ్ర భావజాలం కలిగి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అమెరికాలో ఉంటున్నప్పటికీ ఇరాన్ పట్ల ఆకర్షితుడై ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. అదీగాకుండా ఇరాన్ నిఘా సంస్థ పై అభిమానాన్ని కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అందరి వేళ్లు ఇరాన్ వైపు చూపించాయి. అమెరికా సహా చాలా దేశాలు, మేధావులు సల్మాన్ రష్దీపై దాడిని ఖండిస్తూ అందులో చాలా మంది ఇరాన్ పైనా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలనే ఇరాన్ ఈ ఘటనపై ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది.

సల్మాన్ రష్దీపై శుక్రవారం జరిగిన దాడికి ఇరాన్ కారణమనే ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదని వాదించింది. సల్మాన్ రష్దీపై దాడికి, స్వయంగా ఆయనే లేదా ఆయన సమర్థకులే కారణం అని పేర్కొంది. మతాన్ని సల్మాన్ రష్దీ అవమానించడాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ కింద సమర్థించలేమని తెలిపింది. సల్మాన్ రష్దీపై దాడికి కారణంగా స్వయంగా ఆయనే అని, ఆయన మద్దతుదారులే అని ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి ఇరాన్‌ను నిందించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. సల్మాన్ రష్దీ స్వయంగా ఈ ఆగ్రహానికి కారకుడు అని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి కనాసరర్ కనాని తెలిపారు. ఇస్లాం పవిత్రతను హేళన చేస్తూ 1.5 బిలియన్ల ముస్లిం జనాభాను సెంటిమెంట్లను, వా పవిత్రతను దెబ్బతీస్తూ ఆయన చర్యలు చేశాడని ఆరోపించింది. 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?