కర్ణాటకలో సావర్కర్ పోస్టర్.. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు.. ఒకరిపై కత్తితో దాాడి.. కర్ఫ్యూ అమలు

By Mahesh KFirst Published Aug 15, 2022, 5:09 PM IST
Highlights

కర్ణాటకలో వీడీ సావర్కర్ ఫ్లెక్స్ ఉద్రిక్తతలకు దారి తీసింది. శివమొగ్గ జిల్లాలో అమీర్ అహ్మెద్ సర్కిల్ దగ్గర సావర్కర్ ఫ్లెక్స్ పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ముస్లిం యువకులు కొందరు నిరసనలు వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్స్ తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రొ హిందూ యాక్టివిస్టులు నిరసించారు. దీంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.
 

బెంగళూరు: కర్ణాటకలో సావర్కర్ పై చర్చ ఎక్కువగా జరుగుతున్నది. కర్ణాటక ప్రభుత్వం నిన్న హర్ ఘర్ తిరంగా ప్రకటనలోనూ ఆయన ఫొటో ఉన్నది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను మాత్రం తొలగించడం గమనార్హం. అలాగే, మంగళూరులో సున్నితమైన ప్రాంతంలోని సర్కిల్‌కు సావర్కర్ సర్కిల్ అని పేరు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా, శివమొగ్గలో అమీర్ అహ్మెద్ అనే సర్కిల్ దగ్గర పంద్రాగస్టున సావర్క్ పోస్టర్ పెట్టారు. 

ఈ పోస్టర్‌ను ముస్లిం యువకులు వ్యతిరేకిస్తున్నారు. ఆ పోస్టర్‌ను తొలగించాల్సిందిగా వారు నిరసన చేశారు. కాగా, హిందూ అనుకూల గ్రూపు సభ్యులు అందుకు వ్యతిరేకంగా నిరసన చేశారు. సావర్కర్ ఫ్లెక్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఒక వ్యక్తిపై కత్తితో దాాడి జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి సమీప హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ ఏరియాలో నిషేధాజ్ఞలు విధించారు. శివమొగ్గలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

మంగళూరులోని సూరత్కాల్ జంక్షన్‌కు సావర్కర్ అని పేరు పెట్టాలని నార్త్ మంగళూరు బీజేపీ ఎమ్మెల్యే వై భరత్ శెట్టి.. మంగళూరు నగర కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేశారు. సివిక్ బాడీ అందుకు అంగీకరించింది. అయితే, ప్రభుత్వం నుంచి వెలువడే అధికారిక ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తున్నది. 

కానీ, ఈ పేరు మార్పును సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యతిరేకించింది. సూరత్కాల్ మతపరంగా సున్నితమైన ఏరియా అని వివరించింది. కాబట్టి, సావర్కర్ అని జంక్షన్‌కు పేరు పెట్టడం సరికాదని వివరించింది.

ఈ నేపథ్యంలో తాజాగా, మంగళూరులోని ఈ జంక్షన్ దగ్గర సావర్కర్ బ్యానర్ కొత్తగా పెట్టారు. కానీ, ఎస్‌డీపీఐ అభ్యంతరం చెప్పడంతో ఆ పోస్టర్‌ను తొలగించారు.

click me!