సీబీఐ స్పెషల్ డీసీ జైన్ నియమితులయ్యారు. 1991 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అయిన ఆయన ఈ నెలాఖరున పదవీ విమరణ చేయాల్సి ఉంది. ఈ లోపే ఆయనకు ప్రమోషన్ లభించింది. ఆయన సేవలను మరింత కాలం ప్రభుత్వం పొడిగించే అవకాశం కనిపిస్తోంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్పెషల్ డైరెక్టర్ గా ఐపీఎస్ ఆఫీసర్ డీసీ జైన్ నియమితులయ్యారు. ఈ నియామకం కోసం సిబ్బంది, శిక్షణ శాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తాత్కాలికంగా సీబీఐ అడిషనల్ డైరెక్టర్ గా ఉన్న ఆయనకు స్పెషల్ డైరెక్టర్ గా ప్రమోషన్ కల్పించారు. ఆయన నెల (అక్టోబర్) 31వ తేదీన పదవి విరమణ చేసేంత వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
5 వేల ఏళ్లుగా భారత్ లౌకిక దేశమే - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
undefined
1991 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అయిన జైన్.. ప్రస్తుతం సీబీఐ అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 2023 అక్టోబర్ 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఈ లోపే ఆయనకు ప్రమోషన్ కల్పించారు. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో ఆయన సేవలను మరింత కాలం పొడిగించే అవకాశం ఉంది.
The Appointments Committee of the Cabinet approved the proposal of the Department of Personnel and Training for appointment of 1991-batch Rajasthan cadre Idia Police Service officer DC Jain, Additional Director, CBI as Special Director in CBI by temporarily elevating the post of… pic.twitter.com/yH0pxyDt8W
— ANI (@ANI)ఈ నియామకం పట్ల ఏసీసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. ‘‘1991 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి డీసీ జైన్ ను సీబీఐ స్పెషల్ డైరెక్టర్ గా నియమించాలన్న సిబ్బంది, శిక్షణ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పదవిలో ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పదవి విరమణ పొందే 2023 అక్టోబర్ 31 తేదీ వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారు’’ అని పేర్కొంది.