
Rakesh Tikait: కర్ణాటక రాజధాని బెంగళూరులో రైతు సంఘాల నాయకుడు రాకేష్ టికాయత్ దాడి జరిగింది. విలేకరుల సమావేశంలో కొందరు దుండగులు .. నల్ల ఇంక్ చల్లారు. అంతటితో ఆగకుండా.. కుర్చీలతో దాడికి యత్నించారు. తర్వాత.. రాకేష్ టికాయత్ మద్దతుదారులు నిందితుడిని పట్టుకుని కొట్టారు. అదే సమయంలో.. కార్యక్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఘటన తర్వాత ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున రైతు ఉద్యమాన్ని ప్రారంభించిన రాకేష్ టికాయత్ పై ఓ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చేందుకు వచ్చానని, అందులో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి టికాయత్ తెలిపారు. ఈ సమయంలో ఓ దుండగుడు రాకేష్ టికాయత్ తో పాటు, యుధ్వీర్ సింగ్‌పై కూడా సిరా విసిరారు. ఈ సందర్భంగా గొడవ కూడా జరిగింది.
చంద్రశేఖర్ మద్దతుదారులపై ఆరోపణలు
స్థానిక రైతు నాయకుడు కే చంద్రశేఖర్ మద్దతుదారులే ఈ ఇంక్ విసిరినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గతకొంత కాలంగా.. రైతు నాయకుడు చంద్రశేఖర్ వర్గానికి, రాకేష్ టికాయత్ వర్గానికి విభేదాలు వచ్చినట్టు ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి.