అమానుషం.. జామపండు దొంగిలించాడనే అనుమానంతో దళితుడిపై దాడి, హత్య..

By team teluguFirst Published Nov 7, 2022, 4:49 AM IST
Highlights

జామ పండ్లు దొంగలించాడనే ఆరోపణలతో ఓ దళిత యువకుడిపై తోట యజమానులు దాడి చేసి హతమార్చారు. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

దళితులపై దాడులు ఆగడం లేదు. తరచుగా వారిపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాగాజా ఉత్తరప్రదేశ్ లో కూడా ఓ ఘటన జరిగింది. పండ్ల తోటలో జామపండ్లను దొంగిలించాడనే ఆరోపణలతో ఓ దళిత యువకుడిని పలువురు కొట్టి చంపారు.ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

దారుణం.. కుమారుడికి గుండె జబ్బు నయమవుతుందని.. కూతురు గొంతు నులిమి హత్య చేసిన తల్లి.. ఎక్కడంటే ?

బాధితుడి సోదరుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల దళితుడైన ఓం ప్రకాష్ అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. దారి మధ్యలో ఓ పండ్ల తోట ఉంది. అయితే అతడు ఆ దారి గుండా నడుచుకుంటూ వస్తున్న సమయంలో తోటలో ఓ జామ పండు నేలపై పడి ఉంది. దీంతో కింద పడి ఉన్న జామ పండును తీసుకున్నాడు.

ఓం ప్రకాష్ చేతిలో జామ పండు ఉండటాన్ని ఆ తోట యజమానులు అయిన భీమ్ సేన్, బన్వారీలు గమనించారు. జామ పండును చెట్టు నుంచి దొంగతనం చేశాడని వారు భావించారు. అతడిపై ఆగ్రహంం వ్యక్తం చేశారు. యజమానులిద్దరూ కర్రలు తీసుకొని ఓం ప్రకాష్ ను కొట్టడం ప్రారంభించారు. అనంతరం బరువైన వస్తువులతో కూడా క్రూరంగా దాడి చేశారు. శరీరంతో తీవ్ర గాయాలు కావడంతో బాధితుడు స్పృహ కోల్పోయాడు.

హనీ ట్రాప్ లో ఢిల్లీ క్రికెటర్.. యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్.. చివరికి..

షెడ్యూల్డ్ కులాల కమ్యూనిటీకి చెందిన బాధితుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడి చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో మరణించాడు. “ ఓ యువకుడు గాయపడ్డాడని సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్టు చేశారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది ” అని సర్కిల్ అధికారి ఎకె పాండే చెప్పారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.

అంధేరి ఈస్ట్‌లో ఉద్ధవ్‌ థాక్రే వర్గం గెలుపు.. కానీ ట్విస్ట్ ఇచ్చిన ఓటర్లు

ఈ ఘటనపై అలీగఢ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరు నిందితులపై ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్లను పోలీసులు ప్రయోగించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. పూర్తి విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

click me!