Infosys: ఆయ‌నే మ‌రో ఐదేండ్ల పాటు Infosys CEO, MD..

By Rajesh KFirst Published May 23, 2022, 1:00 AM IST
Highlights

Infosys: ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా స‌లీల్ ప‌రేఖ్ తిరిగి నియమితులయ్యారు. ఆయ‌న‌ రానున్న ఐదు సంవత్సరాల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ అండ్ ఎండీ నియామకాన్ని ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు  ఎక్స్చేంజ్‌ల‌కు తెలియజేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.
 

Infosys: భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్..  ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కం మేనేజింగ్ డైరెక్ట‌ర్ (MD)గా స‌లీల్ ప‌రేఖ్ (Salil Parekh) ని Infosys డైరెక్టర్ల బోర్డు తిరిగి నియ‌మించింది. మ‌రో ఐదేండ్ల పాటు ఆయ‌నే ఈ ప‌ద‌విలో కొన‌సాగుతార‌ని ఎక్స్చేంజ్‌ల‌కు  ఇన్ఫోసిస్ తెలిపింది.ఆయ‌న వ‌చ్చే 1 జూలై 2022 నుండి 31 మార్చి 2027 వరకు ఐదు సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ సీఈవో కం ఎండీగా కొన‌సాగుతార‌ని వెల్ల‌డించింది.

దీనికి సంస్థ వాటాదారుల ఆమోదం ల‌భించాల్సి ఉంద‌ని పేర్కొంది. ఇన్పోసిస్ బోర్డు డైరెక్ట‌ర్ల‌లో ఏ ఒక్క‌రితోనూ స‌లీల్ ప‌రేఖ్‌కు సంబంధం లేద‌న్న‌దనీ, ఆయ‌న‌కు ఎవరి రికమెండేషన్ లేదని, సీఈవో కం మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించ‌డానికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది.  ఉద్యోగుల శ్రమతో అప్రతిహతంగా సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతూ ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న ఇన్ఫోసిస్‌ను మరింత విజయవంతంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నందుకే ఆయన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది
 
నాలుగేండ్లుగా ఇన్ఫోసిస్ అగ్రగామి

సలీల్ పరేఖ్.. జనవరి 2018 నుండి గత 4 సంవత్సరాలుగా ఇన్ఫోసిస్ CEO మరియు MDగా విజ‌య‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.  ఆయ‌న‌కు అంత‌ర్జాతీయంగా ఐటీ సేవ‌ల రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. అనేక కీల‌క ప్రాజెక్టుల‌కు నాయ‌కత్వం వ‌హించారు. 
 
సలీల్ పరేఖ్ ఎవరు. ?

సలీల్ పరేఖ్  దీనికి ముందు.. క్యాప్‌జెమినీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు, క్యాప్‌జెమినీతో ఆయ‌న‌కు 25 సంవత్సరాలకు పైగా సేవ‌లందించి.. అనేక పదవులను నిర్వహించారు. సలీల్ ఎర్నెస్ట్ & యంగ్‌లో ఆయ‌న‌ భాగస్వామి కూడా. ఆయ‌న‌ బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ చేశారు. అనంత‌రం.. కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప‌ట్టా అందుకున్నారు.  
 

click me!