
JHARKHAND: దేశంలో దళిత, గిరిజనుల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకవచ్చిన వారిపై దాడులు, దారుణాలు, వేధింపులకు ఆగడం లేదు.రోజుకు ఏదో ఓ మూల దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ లో కూడా అదే జరిగింది.
జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలో ఓ గిరిజన విద్యార్థినిని ఓ యువకుడు ఇష్టానుసారంగా కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు చేరడంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకూర్ పోలీసులను ఆదేశించారు.
ఇంతకీ ఆ వీడియో ఏం ఉంది...
ఓ గిరిజన బాలికని ఓ యువకుడు అత్యంత క్రురంగా.. విచక్షణరహితంగా.. కాళ్లతో అమ్మాయిని తన్నడం, చేతులతో దారుణంగా కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో..ఆ అమ్మాయి ఆ యువకుడి దెబ్బలు తాళలేక కింద పడిపోయింది, అయినప్పటికీ ఆ యువకుడు ఆ అమ్మాయిని తన్నుతూనే ఉన్నాడు. అమ్మాయిని యువకుడు కొడుతుంటే అతని స్నేహితులు వీడియో తీస్తూ.. రక్షస ఆనందాన్ని పొందారు. అంతటితో ఆగకుండా ఆ వీడియో వివిధ వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోను కొందరు షేర్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో రజనీ ముర్ము అనే సామాజికవేత్త దృష్టికి రావడంతో .. ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు.
దీంతో ఈ వీడియో జార్ఖండ్ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. రజనీ ముర్ము ట్విట్టర్ హ్యాండిల్ నుండి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పాకూర్ అసెంబ్లీ ఎమ్మెల్యే అలంగీర్ ఆలమ్‌ను ట్యాగ్ చేశారు. గిరిజన మహిళలపై నిత్యం ఇలాంటి దాడులు చేయడమే కాకుండా హింసాత్మక వీడియోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఓ యువకుడి చేతిలో దాడికి గురైన ఆ బాలిక స్కూల్ యూనిఫామ్‌లో ఉంది. పాకూర్‌లోని సెయింట్ స్టానిస్లాస్ హైసూల్క్ లో చదువుతోందని తెలిపారు.
ఆ వీడియో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పందించారు. ఆ బాలుడిపై చర్యలు తీసుకోవాలని పాకుర్ DC, SP ని ఆదేశించారు. అంతే కాదు చర్యలు తీసుకుని తమకు తెలియజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు వ్యక్తులు పాకూర్ డీసీ, ఎస్పీలను కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసులో యువకుడి అరెస్టు
సిఎం హేమంత్ సోరెన్ ఆదేశానుసారం, మహేశ్‌పూర్ పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకున్నారు. మైనర్ బాలిక, ఆ యువకుడు..ఇద్దరూ దుమ్కా జిల్లాలోని గోపికందర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన అమలదాహి, ధోల్ ఖరౌనీకి చెందినవారని తేలింది. అనంతరం గోపికందర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సహాయంతో దాడికి పాల్పడిన యువకుడి.. అతనికి సహకరించిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువకుడు ఆ బాలికపై ఎందుకు దాడి చేశాడనే అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.