ఏడునెలల పసికందుపై వీధి కుక్కల దాడి, పేగులు బయటికి లాగి.. అమానుషం...

By SumaBala BukkaFirst Published Oct 18, 2022, 11:42 AM IST
Highlights

నోయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఏడునెలల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి.. పొట్టలోని పేగులు బయటికి లాగింది. దీంతో చిన్నారి మృతి చెందింది. 
 

నోయిడా : తల్లిదండ్రులు భవన నిర్మాణంలో కూలి పనులు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి ఏడు నెలల పసికందుపై ఓ వీధికుక్క దాడి చేసింది. పేగులు బయటకు రావడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లోటస్ బౌలేవార్డ్ సెక్టార్ హండ్రెడ్ లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలిపని చేసుకునే ఓ కుటుంబం తమ ఏడు నెలల పాపతో అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీధి కుక్క ఆ చిన్నారిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శిశువును నోయిడాలోని యధార్ధ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. పసికందు పేగులు బయటకు రావడం వల్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. 

ఉగ్రవాదులు, డ్రగ్స్ స్మగ్లర్ల మధ్య సంబంధాలపై టార్గెట్.. పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు..

మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కలు దాడి చేయడం ఇది మొదటిసారి కాదని ప్రతి మూడు నెలలకోసారి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. నోయిడా అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ విషయంపై  ఏఓఏ స్పందించారు. నోయిడా ఆధారిటీతో మాట్లాడానని ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు.

click me!