రైలులో ఎండ వేడి.. తల్లి ఒడిలోనే పసిబిడ్డ మృతి

First Published May 26, 2018, 2:40 PM IST
Highlights

ఎండ వేడి తట్టుకోలేకపోయిన ఐదు నెలల పసికందు

రైలులో ఎండ వేడి తట్టుకోలేక ఓ చిన్నారి తల్లి ఒడిలోనే ప్రాణాలు విడిచింది. దిబ్రూగఢ్-న్యూఢిల్లీ బ్రహ్మపుత్ర మెయిల్‌ రైల్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన తోటి ప్రయాణికులను సైతం కంటతడి పెట్టించింది. రైలు మిజార్‌పూర్ చేరేటప్పటికే తొమ్మిది గంటలు ఆలస్యమైంది. తర్వాత మళ్లీ అలహాబాద్ జంక్షన్ శివారు ప్రాంతంలో మరో గంటన్నరసేపు నిలిపివేశారు.  అదే రైల్లో బీహార్‌లోని కైమూర్‌కి చెందిన మహ్మద్ కుటుంబం ప్రయాణిస్తోంది. రైల్లో వేడి, ఉక్కపోత కారణంగా మహ్మద్ ఐదు నెలల బిడ్డ తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన పసికందును దగ్గరలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు.
 
అయితే సమాచారం అందిన వెంటనే తాము రైల్వే ఆస్పత్రి నుంచి వైద్యులను పంపించామనీ.. అప్పటికే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా రైల్లో ఏసీ పనిచేయకపోవడం వల్లే చిన్నారి చనిపోయిందంటూ ప్రయాణిలు ఆందోళన చేపట్టారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. ‘‘బాధితులు నాన్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. అందువల్ల అక్కడ ఏసీ 
వైఫల్యం ఉందన్న ప్రశ్నేలేదు. ప్రయాణికులు ఆరోపిస్తున్నట్టు రైలును శివారు ప్రాంతంలో ఆపలేదు.. అంతకు ముందురోజు రాత్రి భారీ తుఫాను కారణంగా ఆ మార్గం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది...’’
 అని వెల్లడించారు.

click me!