భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల మృతి

First Published May 26, 2018, 1:00 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ తందారా సెక్టార్ లో కొనసాగుతున్న కాల్పులు

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారత్ లో అల్లర్లు సృష్టించాలన్న ఉగ్రవాదుల కార్యకలాపాలను భద్రతా దళాలు ఆదిలోనే అడ్డుకున్నాయి. ఇవాళ ఉదయం జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని తందార్ సెక్టార్ లో నలుగురు చొరబాటుదారులను భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో వారు భద్రతాదళాలపై కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులకు దిగి వారిని హతమార్చారు.

రంజాన్ ఉపవాస దీక్షలు, పండగ ను ప్రశాంతంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను కేంద్ర హోం శాఖ నిలిపివేసింది. ఇదే అదునుగా భావించిన ఉగ్రమూకలు జమ్మూ కాశ్మీర్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అలజడి సృష్టించాలని పథకం పన్నారు. అందుకోసమే ఈ చొరబాట్లు జరిగి ఉంటాయని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

భారత్‌ కాల్పుల విరమణ ప్రకటించినప్పటికి సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. తాజాగా తందార్‌ సెక్టార్‌లో చొరబాటుదారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇంకా ఈ కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.  

click me!