ఇంజినీర్ వదిలి వ్యవసాయం వైపు అడుగులు.. అతని సంపాదన తెలిస్తే షాకే..!

By Mahesh Rajamoni  |  First Published Sep 12, 2023, 3:43 PM IST

ఇంజినీర్ జాబ్ ఉంటే చాలు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా బతికేయొచ్చు. ఎందుకంటే ఈ జాబ్ లో లక్షల్లో జీతం వస్తుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇంజినీర్ జాబ్ వదిలేసి మరీ వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చాడు. రావడమేంటి దేశంలోనే అత్యంత ధనవంతుడైన రైతుగా మారిపోయాడు. 
    


ఇండియాలో ఎక్కువ వేతనం వచ్చే ఉద్యోగాల్లో ఇంజినీర్ ఒకటి. అందుకే చాలా మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ వైపే మొగ్గుచూపుతారు. దేశంలో ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లు అత్యధిక వేతనాన్ని పొందుతున్నారు. లక్షల్లో వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఎవరూ అనుకోరు. కానీ ఓ వ్యక్తి మాత్రం లక్షలోచ్చే ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలిసి మరీ వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చాడు. అతని పేరు ప్రమోద్ గౌతమ్. ఇప్పుడు ఇప్పుడు భారతదేశపు అత్యంత ధనిక రైతుగా మారిపోయాడు తెలుసా? మరి ఇతని సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రమోద్ గౌతమ్ మహారాష్ట్రకు చెందినవాడు. ప్రమోద్ గౌతమ్ ఒక ఇంజనీర్ నుంచి భారతదేశంలోని అత్యంత ధనిక రైతుగా మారిపోయాడు. ఇతను చాలా మంది ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓల కంటే ఎక్కువగా సంపాదించాడు.

Latest Videos

ప్రమోద్ గౌతమ్ ఒక పెద్ద ఎంఎన్ సీలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. అంతేకాదు  ఇతని జీతం భారీ మొత్తంలోనే ఉండేది. అయితే గౌతమ్ పేరు మీద 26 ఎకరాల పొలం ఉంది. అయితే అతను తన ఉద్యోగాన్ని వదిలేసి ఒక రైతుగా, పారీశ్రామిక వేత్తగా మారాలని నిర్ణయించుకున్నాడు.

ఇతను అందరిలా కేవలం సాంప్రదాయ వ్యవసాయానికే అతుక్కుపోకుండా ఇంజనీర్ నుంచి పారిశ్రామికవేత్తగా మారి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఇతను గ్రీన్ హౌస్ లో పండ్లు, కూరగాయలను పండించే హార్టికల్చర్  విధానాన్ని ఎంచుకున్నాడు. 

undefined

ప్రమోద్ గౌతమ్ మొదట్లో వేరుశనగ, పసుపును సాగుచేశాడు. అయితే ఇందులో ఇతనికి పెద్దగా ఏం లాభం రాలేదు. దీంతో అతను తర్వాత పెసరపప్పును పండించాలనుకున్నాడు. అయితే ఇతను పండించే పెసరపప్పును పాలీష్ చేయరు. ఇది కల్తీ లేనిది. అలాగే ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు.

దీంతో ఇతను పండించే ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది. లాభాలు కూడా ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. ఇంకేముంది మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ప్రమోద్ గౌతమ్ వందనా ఫుడ్స్ పేరుతో సొంత దాల్ బ్రాండ్ ను ప్రారంభించారు. ఆయన బ్రాండ్ ప్యాకేజ్డ్ ధాన్యం ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకేముంది ఈయన ధాన్యాలు దేశమంతటా ఉపయోగిస్తున్నారు. 

ఇక ప్రమోద్ ఆదాయం విషయానికొస్తే.. ఈయన ప్రతి సంవత్సరం సుమారు రూ .1 కోటి సంపాదిస్తాడు. అంటే నెలకు ఇతని జీతం రూ .10-12 లక్షల మధ్య ఉంటుంది. ఇది చాలా మంది ఐఐటి, ఐఐఎం గ్రాడ్యుయేట్ల కంటే ఎక్కువ. అందుకే ఇతను దేశంలో మొత్తంలో అత్యంత ధనిక రైతుగా నిలిచాడు. ఎందరికో ఆదర్శవంతుడయ్యాడు. 
 

click me!