Odisha: ఒలింపిక్ వాల్యూ ఎడ్యూకేష‌న్ ప్రొగ్రాంను ప్రారంభించిన ఒడిశా !

Published : May 24, 2022, 04:45 PM IST
Odisha: ఒలింపిక్ వాల్యూ ఎడ్యూకేష‌న్ ప్రొగ్రాంను ప్రారంభించిన ఒడిశా !

సారాంశం

Olympic Values Education Programme: ఒడిశా పాఠశాల పాఠ్యాంశాల్లో ఒలింపిక్ వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (OVEP)ని చేర్చాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), అభినవ్ బింద్రా ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.   

Olympic Values Education Programme-Odisha: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం రాష్ట్రంలో భారతదేశపు మొట్టమొదటి ఒలింపిక్ వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (OVEP)ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు దీన్ని ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, మొదటి దశలో భువనేశ్వర్, రూర్కెలా అనే రెండు స్మార్ట్ సిటీలలోని 90 పాఠశాలల్లో దీనిని అమ‌లు చేయ‌నున్నారు. అధికారిక వర్గాల ప్రకారం, రూర్కెలాలోని 27 పాఠశాలలు, భువనేశ్వర్‌లోని 63 పాఠశాలల్లో Olympic Values Education Programme (OVEP) ప్రారంభించబడుతుంది.

ఒడిశా పాఠశాల పాఠ్యాంశాల్లో ఒలింపిక్ వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (OVEP)ని చేర్చాలని ఇదివ‌ర‌కే  ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), అభినవ్ బింద్రా ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. OVEP ఆధారిత ప్రాజెక్ట్‌లు, కార్యకలాపాలు పిల్లలలో నిశ్చల జీవనశైలి, ఏకాగ్రత లేకపోవడం మరియు డ్రాప్ అవుట్‌ల సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయి. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా పిల్లలకు విద్య, నైపుణ్యం పెంపొందించేందుకు ఈ ప్రాజెక్ట్ ను తయారు  చేశారు. మొదటి దశలో భువనేశ్వర్, రూర్కెలా నగరంలోని 90 పాఠశాలల్లోని 32 వేల మంది పిల్లలను ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేయడానికి ప్రణాళిక చేయబడింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే దాదాపు 70 లక్షల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో దశలవారీగా అమలు చేయాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తోంది.  

ఈ ప్రాజెక్టు ప్రారంభంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, విద్యా మంత్రి సమీర్ రంజన్ దాస్, ఒలింపిక్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్ మైకేలా కొజువాంకో జావోర్స్కీ, IOC సభ్యుడు నీతా అంబానీ, IOA అధ్యక్షుడు నరీంద్ర ధ్రువ్ బత్రా, ఒలింపిక్ ఫౌండేషన్ ఆఫ్ కల్చర్ అండ్ చేంజ్ ఏంజెలిటా టియో డైరెక్టర్, S&ME శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విష్ణుపాద్ సేథీ స‌హా ప‌లువురు పాలుపంచుకున్నారు. “భారతదేశంలోని 250 మిలియన్లకు పైగా పాఠశాల పిల్లలకు విలువల ఆధారిత అభ్యాసాన్ని వాస్తవంగా మార్చే దిశగా మొదటి అడుగు వేసినందుకు గర్వంగా  హృద‌యం ఉప్పొంగుతోంది. ఒడిశాలోని పాఠశాల విద్యా వ్యవస్థలో మొదట అమలు చేయడానికి ఒలింపిక్ వాల్యూ ఎడ్యూకేష‌న్ ప్రొగ్రాంను ప్రారంభించింది" అని బింద్రా ట్వీట్ చేశారు.

"ఒలింపిక్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2006 నుండి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయబడి.. అమ‌లు చేయ‌బ‌డుతోంది.ఈ రోజు భారతదేశంలోని పిల్లలు మరియు యువకులకు ఈ ఒలింపిక్ విలువల-ఆధారిత విద్యను వ్యాప్తి చేయడానికి మేము మొదటి అడుగులు వేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఒలింపిక్ విద్య మరియు ఒలింపిక్ సంస్కృతి ప్రపంచంలో సానుకూల మార్పును తీసుకురావడానికి శక్తివంతమైన సాధనం ” అని IOC ఎడ్యుకేషన్ కమిషన్ చైర్ మైకేలా కొజువాంగ్కో జావోర్స్కీ అన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?