12 వేలు దాటిన కోవిడ్ కొత్త కేసులు.. భారీగా పెరిగిన క‌రోనా కొత్త మ‌ర‌ణాలు

By Mahesh Rajamoni  |  First Published Apr 22, 2023, 2:46 PM IST

New Delhi: భార‌త్ లో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 12,193 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే, కొత్తగా 42 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్-19 సంబంధిత మరణాల సంఖ్య 5,31,300కి చేరుకుంది. 
 


India coronavirus update: భారతదేశంలో కోవిడ్ -19 కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో 12,193 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కొత్త కేసులు పెరుగుద‌ల కార‌ణంగా క్రియాశీల కేసులు సైతం పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 67,556 కు పెరిగింది.

శ‌నివారం ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన క‌రోనా వైర‌స్ వివ‌రాల‌ను కేంద్రం ఆరోగ్య‌ మంత్రిత్వ శాఖ వెల్ల‌డిస్తూ.. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశంలో కొత్త‌గా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్య‌ధికంగా కేర‌ళ‌లో 10 మంది మ‌ర‌ణించారు. దీంతో కోవిడ్ కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 5,31,300 కు పెరిగింది. కాగా, దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి న‌మోదూన మొత్తం కేసుల సంఖ్య 4,48,81,877 పెరిగింది.

Latest Videos

undefined

దేశంలో న‌మోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.15 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.66 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,83,021కి చేరగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల యాంటీ కోవిడ్ వ్యాక్సిన్లు ప్రజలకు అందించారు. కాగా, ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. 

కాగా, మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అత్యంత అంటువ్యాధి అయిన ఇన్ ప్లూయెంజా హెచ్3ఎన్2 సంఖ్య తగ్గింది. గత 15 రోజుల్లో ఇన్ ఫ్లూయెంజా హెచ్3ఎన్2 కేసులు అంతకుముందు రెండు వారాలతో పోలిస్తే 32 శాతం తగ్గాయి. ఫ్లూకు కారణమయ్యే వైర‌స్ లు నాలుగు వేర్వేరు రకాలుగా ఉంటాయ‌నీ, ఏ, బీ, సీ, డీల‌ని వైద్యులు తెలిపారు.

click me!