మళ్లీ ఎయిమ్స్ లో చేరిన హో మంత్రి అమిత్ షా

Published : Sep 13, 2020, 07:23 AM IST
మళ్లీ ఎయిమ్స్ లో చేరిన హో మంత్రి అమిత్ షా

సారాంశం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అనారోగ్యంతో శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన ఎయిమ్స్ లో చేరారు. ఇంతకు ముందు ఓసారి ఇటీవల ఎయిమ్స్ లో ఆయన చికిత్స పొందారు.

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. మరోసారి అనారోగ్యం బారిన పడడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో అమిత్ షా ఎయిమ్స్ లోని కార్డియో న్యూరో టవర్ లో చేరారు. 

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అమిత్ షా శ్వాస సబంధమైన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా ఆయన పోస్ట్ కోవిడ్ చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరారు. ఆగస్టు 31 తేదీన డిశ్చార్జి అయ్ాయరు. 

ఆగస్టు 2వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో అమిత్ షథా గురుగ్రామ్ లోని వేదాంత ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత ఆగస్టు 14వ తేదీన ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. తిరిగి 4 రోజుల తర్వాత ఆగస్టు 18వ తేదీన పోస్ట్ కోవిడ్ కేర్ కోసం ఎయిమ్స్ లో చేరారు.

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?