లైవ్‌లోనే సహోద్యోగికి ప్రపోజ్: వైరలైన వీడియో

By narsimha lode  |  First Published Mar 12, 2024, 12:50 PM IST

ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించే ట్యూటర్  తన సహోద్యోగికి లైవ్ లో ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.


న్యూఢిల్లీ:ఆన్ లైన్ అధ్యాపకుడు లైవ్ క్లాస్‌లోనే తన సహోద్యోగికి ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.నవీన్ తివారీ  ఆన్ లైన్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. అతిపెద్ద ఆశ్చర్యకరమైన రివీల్ అనే శీర్షికతో లైవ్ సెషన్ లో తన సహోద్యోగి సోనా శర్మకు  ప్రపోజ్ చేశాడు నవీన్. 

also read:కారణమిదీ:హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

Latest Videos

తన వృత్తి జీవితంలో కాకుండా వ్యక్తిగతంగా కూడ మీ మద్దతును ఆశిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఎప్పటికి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏది తప్పో,ఏది ఒప్పో తనకు తెలియదన్నారు.  ఐ లైక్ యూ లేదా ఐ లవ్ యూ వంటివి చెప్పడానికి కూడ తాను ఇష్టపడనన్నారు.

 

Evolution of Marriage :

Before 1950s - Parents decide
Next 70 Years - Parents + Ladka/Ladki
2024 Onwards - Audience Decides

😭😭😭

pic.twitter.com/DFeiDpYaGi

— Shekhar Dutt (@DuttShekhar)

 

also read:40 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోనా మేడం మీరు నన్ను పెళ్లిచేసుకుంటారా అని అడగాలనుకుంటున్నానని నవీన్ అడిగారు. ఈ వ్యాఖ్యలకు సోనా అవాక్కయింది.  అయితే వెంటనే తేరుకొని సోనా అంగీకరించింది. అయితే ఈ విషయమై రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని ఆమె సూచించింది.

also read:టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: ఎవరి లెక్కలు వారివి....

ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.  ఈ వీడియోను చూసి పలువురు నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.  కొందరు ఈ వీడియోను చూసి నవ్వుకున్నారు. మరికొందరు సోనా అసౌకర్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు దీన్ని గమనించిండి.. ఇది అత్యంత ముఖ్యమైన సంఘటన అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. 

 


 

click me!