
భారత నౌకాదళం (indian navy) శనివారం లాంగ్ రేంజ్ వెర్షన్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి (BrahMos cruise missile)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు భారత నౌకాదళం అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో వివరాలు పోస్ట్ చేసింది. ‘‘అధునాతన వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్ధ్యం విజయవంతంగా ప్రయోగించిబడింది. టార్గెట్ పిన్ పాయింట్ ధ్వంసం చేయడం ద్వారా పోరాటాన్ని, ఫ్రంట్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మిషన్ సంసిద్ధతను ప్రదర్శించింది. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు మరో షాట్ ’’ అని ట్వీట్ చేసింది.
బ్రహ్మోస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి, ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం భారతదేశం (DRDO), రష్యా (NPOM) లు కలిసి రూపొందించిన జాయింట్ వెంచర్. బ్రహ్మోస్ అనేది సాయుధ దళాలలో ఇప్పటికే చేర్చని అత్యంత శక్తివంతమైన ప్రమాదకర క్షిపణి ఆయుధ వ్యవస్థ.
బ్రహ్మోస్ ఏరోస్పేస్, సముద్రం, భూమి తన లక్ష్యాలను ఛేదించగలదు. అయితే దీని ప్రభావాన్ని, సామర్థ్యాన్ని పెంచడానికి అత్యంత బహుముఖమైన బ్రహ్మోస్‌ను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ శక్తివంతమైన ఆయుధ వ్యవస్జను ఇప్పటికే సాయుధ దళాల్లో ఇప్పటికే చేర్చారు. కాగా 2017లో బ్రహ్మోస్ ఎయిర్-లాంచ్ వేరియంట్ ను సుఖోయ్-30MKI నుంచి విజయవంతంగా పరీక్షించారు.