8000 ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వ ఆదేశం

Published : May 13, 2025, 07:55 AM IST
8000 ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వ ఆదేశం

సారాంశం

పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో, భారత ప్రభుత్వ ఆదేశాలతో ఎక్స్ ఇండియాలో 8,000కి పైగా ఖాతాలను బ్లాక్ చేసింది.

ఢిల్లీ:

పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠినంగా స్పందించింది. దేశ భద్రతా పరిస్థితుల పరంగా, జమ్మూ కశ్మీర్ సహా వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో పాటు సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న చర్చలు, ప్రచారాలను కూడా అదుపులోకి తీసుకోవడంలో భాగంగా చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ (మాజీ ట్విట్టర్) కు భారత ప్రభుత్వం 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేయాలంటూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

ఎక్స్ తెలిపిన ప్రకారం, ఆదేశాలను పాటించకపోతే కంపెనీకి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించబడే అవకాశం ఉందని, అంతేకాక దేశంలోని ఉద్యోగులు కూడా శిక్షార్హులయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నది ప్రభుత్వం స్పష్టం చేసిన అంశాలలో ఒకటి. ఈ కారణంగా, ఎక్స్ ఈ ఖాతాలను భారతదేశంలో మాత్రమే అడ్డుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వాటి యాక్సెస్ కొనసాగుతుంది.

బ్లాక్ చేసిన ఖాతాలలో కొంతమంది అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు ప్రముఖ వ్యక్తుల ఖాతాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఖాతాలు ఏమి నిబంధనలు ఉల్లంఘించాయన్నది ప్రభుత్వం వెల్లడి చేయలేదని ఎక్స్ పేర్కొంది.

ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న ఎక్స్ సంస్థ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల్లో పారదర్శకత ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పింది. కానీ దేశ చట్టాలు అప్పటి పరిస్థితుల్లో ఎలాంటి వివరాలు పంచుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపింది. అదేవిధంగా, పూర్తిగా ఖాతాలను బ్లాక్ చేయడమన్నది భావ ప్రదర్శన స్వేచ్ఛకు వ్యతిరేకమని, ఇది కంటెంట్ సెన్సార్‌షిప్‌కు దారితీస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.

ఇందులో ముఖ్యంగా గుర్తించాల్సిందిగా ఎక్స్ తన సేవలను భారత్‌లో కొనసాగించాలంటే ఈ బ్లాకింగ్‌ను అమలు చేయాల్సిన అవసరముందని తెలిపింది.

.X has received executive orders from the Indian government requiring X to block over 8,000 accounts in India, subject to potential penalties including significant fines and imprisonment of the company’s local employees. The orders include demands to block access in India to…

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !