పాక్‌ను తిప్పికొట్టాం, పైల‌ట్‌ గల్లంతు: భారత్

Published : Feb 27, 2019, 03:28 PM ISTUpdated : Feb 27, 2019, 03:43 PM IST
పాక్‌ను తిప్పికొట్టాం, పైల‌ట్‌ గల్లంతు: భారత్

సారాంశం

ఇవాళ ఉదయం పాక్‌కు చెందిన వైమానిక దాడులను తాము సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు భారత వైమానిక దళం ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఇవాళ ఉదయం పాక్‌కు చెందిన వైమానిక దాడులను తాము సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు భారత వైమానిక దళం ప్రకటించింది.

బుధవారం నాడు భారత ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకె కపూర్  మీడియాతో మాట్లాడారు. మిగ్ 21 విమానం కూలిపోయిందని చెప్పారు. అయితే పైలెట్‌‌ మిస్సింగ్‌గా ఆయన ప్రకటించారు.

ఇవాళ ఉదయం భారత గగనతలంలో మూడు కిలోమీటర్ల మేరకు పాక్ విమానాలు చొచ్చుకొచ్చినట్టుగా ఆయన ప్రకటించారు.భారత మిలటరీ స్థావరాలపై దాడికి పాక్ విమానాలు వచ్చాయన్నారు. అయితే పాక్ పన్నాగాన్ని భారత దళాలు దీన్ని తిప్పికొట్టాయని చెప్పారు. మరో వైపు ఓ మిగ్ 21 విమానం పాక్ భూభాగంలో కుప్పకూలిపోయిందని చెప్పారు. పైలెట్ గల్లంతు అయినట్టు ఆయన ధృవీకరించారు.  

అయితే ఓ పైలెట్ తమ ఆధీనంలో ఉన్నట్టుగా పాక్ చెప్పుకొంటుందన్నారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉందని ఆయన ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..