మోడీ స్పూర్తిదాయకమైన మద్దతు: ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న అథ్లెట్లు

ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  నిన్న న్యూఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో సమావేశమయ్యారు. ప్రధాని మోడీ మద్దతు పట్ల  క్రీడాకారులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Google News Follow Us

న్యూఢిల్లీ: ఏషియన్ గేమ్స్ లో భారత్ కు చెందిన అథ్లెట్లు  అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.  ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రసంగించారు. న్యూఢిల్లీలోని  థ్యాన్ చంద్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు.

ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న అథ్లెట్లు  ప్రధాని నరేంద్ర మోడీ అందించిన  మద్దతును  కొనియాడారు. భారత్ వివిధ రంగాల్లో రాణిస్తుందని  క్రీడాకారుడు నీరజ్ చోప్రా చెప్పారు. ఇండియాకు మరిన్న విజయాలు అందించేందుకు ఇదే సరైన సమయంగా ఆయన పేర్కొన్నారు.. 

 


తమకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన ప్రేరణ ఇచ్చారని క్రికెటర్ యశస్వి జైశ్వాల్ చెప్పారు.దేశం గర్వపడేలా మోడీ చేసినప్పుడల్లా తమ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.తాము ఎప్పుడూ పతకాలు గెలుచుకొనే అవకాశంతో పాటు మోడీ కలిసే అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేశారు హకీ ప్లేయర్ సవితా.

 

మోడీ నేతృత్వంలో కీలక పథకాలు, ఖేలో ఇండియా కార్యక్రమాల గురించి షాట్ పుట్ క్రీడాకారుడు రాజేందర్ సింగ్ నొక్కి చెప్పారు.

 

క్రీడలకు  ప్రధాని మోడీ అద్బుతమైన తోడ్పాటును అందించారన్నారు.
 

Read more Articles on