తేజస్‌లో విహరించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

By Siva KodatiFirst Published Feb 21, 2019, 2:49 PM IST
Highlights

బెంగళూరులో జరుగుతున్ ఏరో ఇండియా షోలో తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విహరించారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌ను ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు. 

బెంగళూరులో జరుగుతున్ ఏరో ఇండియా షోలో తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విహరించారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌ను ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు.

దీనిలో భాగంగా మరో పైలట్‌తో కలిసి రావత్ ఇందులో ప్రయాణించారు. దీనిలో విహరించడానికి వీలుగా ఆయన శిక్షణ తీసుకున్నారు. ఈ యుద్ధవిమానం బుధవారం వాయుసేన అమ్ములపొదిలో అధికారికంగా చేరింది.

తేజస్‌కు సంబంధించిన పూర్తిస్ధాయి నిర్వహణ అనుమతి ధ్రువీకరణ పత్రాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) బుధవారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది. యుద్ధాల్లో పాల్గొనేందుకు ఈ విమానం సిద్ధంగా ఉందని చెప్పేందుకు నిర్వహణ అనుమతిని జారీ చేస్తారు.

తేజస్‌ను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడం, ఎలక్ట్రానిక్ యుద్ధ సూట్లతో పాటు పలు రకాల బాంబులు-ఆయుధాలను కలిగి ఉండటం దీని ప్రత్యేకతలు. 

 

Chief of the Army Staff General Bipin Rawat: Flight in LCA Tejas was an experience of a lifetime. From what I could witness, avionics are very good, it's targeting is very good. It's a wonderful aircraft if it gets added to inventory it will increase our air power. pic.twitter.com/WwUcFC6ekT

— ANI (@ANI)
click me!