యుద్ధ మేఘాలు: త్రివిధ దళాలకు సెలవులు రద్దు

By Siva KodatiFirst Published Feb 26, 2019, 11:33 AM IST
Highlights

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగడంతో భారత్-పాకిస్తాన్‌ల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. తొలిసారిగా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కంటే తీవ్రమైన దాడులు కావడంతో పొరుగు దేశం ఈసారి రెచ్చిపోయే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉండటంతో త్రివిధ దళాలకు సెలవులు రద్దు చేసింది. తీర ప్రాంతాలతో పాటు పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించింది.

మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు, హోంశాఖ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశంలో పాల్గొన్నారు. 

click me!